ఆస్తి కోసం కొట్లాట.. డ్రగ్స్‌కి బానిస.. ఈ రెండు కారణాలతో హైదరాబాద్ మహానగరం దారుణ హత్య జరిగింది. ఇదేదో మామూలు మర్డర్ కాదు.. సొంత తాతనే మనవడు హత్యచేసిన ఘటన సంచలనం రేపింది. ప్రముఖ పారిశ్రామికవేత్త వీసీ జనార్ధనరావును అత్యంత పాశవికంగా హతమార్చాడు అతని మనవడు కీర్తితేజ. పంజాగుట్టలో జరిగిన ఈ హత్య కేసు సంచలనంగా మారింది.
ఆస్తి కోసం జనార్ధనరావును మనవడు కీర్తితేజ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. 73 సార్లు జనార్ధనరావును కత్తితో పొడిచి చంపినట్లు వెల్లడించారు. కంపెనీలో డైరెక్టర్ పోస్టు ఇవ్వలేదన్న కోపంతో హత్య చేసినట్లు తెలిపారు. జనార్దన్‌రావుని చంపుతుంటే అడ్డం వచ్చిన తల్లిని కూడా 12సార్లు పొడిచాడు కీర్తి తేజ. తల్లి, తాత అరుపులు విని ఇంట్లోకి వచ్చారు స్థానికులు. అయితే అప్పటికే జనార్ధన్ రావు చనిపోగా..తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న కీర్తి తేజ తల్లిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి పరిస్థితి విషమంగా ఉంది.
అమెరికా నుంచి ఇటీవలే హైదరాబాద్ వచ్చిన కీర్తితేజ.. జనార్ధన్‌రావు కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ ఇవ్వాలంటూ తాత వీసీ జనార్ధనరావుపై ఒత్తిడి తీసుకువచ్చాడు. కీర్తితేజ డ్రగ్స్‌కు బానిస కావడంతో అతనికి పోస్ట్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో జనార్ధనరావును హత్య చేశాక, ఏలూరుకు కీర్తితేజ పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వెంటనే అప్రమతమై, ఏలూరులో కీర్తితేజను అరెస్ట్ చేశారు. ఏలూరు దగ్గర కొవ్వలి గ్రామం జనార్దన్‌రావు సొంతూరు. ఈ మర్డర్‌తో కొవ్వలి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..