ఫుడ్‌సేఫ్టీ విషయంలో టీవీ9 గట్టి సంకల్పంతో ఉంది. ఏరోజుకారోజు ఫుడ్‌సెంటర్ల వ్యవహారం నుంచి తనిఖీల దాకా కథనాలను రన్ చేస్తూ మిమ్మల్ని అలర్ట్ చేస్తోంది. అటు ఫుడ్ సేఫ్టీ, జీహెచ్‌ఎంసీ అధికారులు సైతం కల్తీపై సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. క్వాలిటీ లేకపోయినా కల్తీ కనిపించినా… హోటళ్లు, రెస్టారెంట్లను సీజ్ చేస్తున్నారు. అయినా నో ఛేంజ్… కల్తీగాళ్ల వక్రబుద్ధి మారట్లేదు. కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్లుగా ప్రతీ దాన్ని కల్తీ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో 1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను గుర్తించారు. కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్ తయారు చేసి.. సిటీలోని చాలా రెస్టారెంట్ల, హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ కల్తీ అల్లం వెల్లుల్లు పేస్ట్ తయారు చేస్తున్న 8మందిని అరెస్ట్ చేశారు.
ఇక మరో షాకింగ్ విషయమేంటంటే… ఫుడ్ కల్తీలో హైదరాబాద్ నెంబర్ వన్‌గా నిలిచింది. 19 నగరాల్లో సర్వే చేసి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో… హైదరాబాద్ కల్తీలో నెంబర్ అని తెలిపింది. ఇలా కల్తీలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోంది. అయినా ఏమాత్రం మార్పు కనిపించట్లేదు. బయట కలర్ ఫుల్ ప్యాకింగ్… లోపట కల్తీ కోటింగ్‌తో జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. గతకొన్ని రోజులుగా హోటళ్లు, రెస్టారెంట్లలోని గబ్బుకొట్టే వంట గదులను చూశాం… ఇప్పుడు ఫుడ్ ప్రోడక్ట్ కల్తీ కోటింగ్‌ని చూస్తున్నాం… సో అవుట్ సైడ్ పుడ్ అయినా…ఫుడ్ ప్రొడక్ట్స్ కొనేప్పుడైనా ప్రతిఒక్కరూ కేర్ ఫుల్‌గా ఉండాల్సిందే.