ట్రిపుల్ బెడ్రూం ఇంటికి నెలకు వచ్చిన కరెంట్ బిల్లు రూ.72.. అలాగే కమర్షియల్ బిల్డింగ్‌కు వచ్చిన బిల్.. రూ.200. ఎక్కువగా కమర్షియల్ కాంప్లెక్స్‌లు, పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్స్ ఉండే చోట ఇంత తక్కువ బిల్లు వస్తుందంటే అధికారులకు వెంటనే అనుమానం కలుగుతుంది కదా..! కానీ శేరిలింగంపల్లి తారానగర్ సెక్షన్ పరిధిలోని విద్యుత్ శాఖ సిబ్బందికి మాత్రం ఎలాంటి డౌట్ రాలేదు. స్థానికులే విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. వారి ఎంక్వైరీలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్ మహానగరంలోని శేరిలింగంపల్లి, హుడా ట్రేడ్ సెంటర్‌లోని గాంధీ ఎస్టేట్.. డీ బ్లాక్‌లో తరచూ కరెంట్ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. దీనిపై విచారించగా.. కొందరు దొంగతనంగా విద్యుత్తు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. విజిలెన్స్ అధికారులకు కంప్లైంట్ చేయడంతో వారు సీన్‌లోకి వచ్చారు. దీంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని నెలలుగా ఓ ట్రిపుల్ బెడ్ రూమ్ ఇంటికి అతి తక్కువగా వచ్చినట్లు గుర్తించారు. కొన్నిసార్లు అయితే కేవలం రూ.72 మాత్రమే వచ్చినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది.
రెండు మీటర్లున్న కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఒకటి వర్క్ చేయకుండా చేసి, మరో దానిపై కేవలం రూ.200, కుదిరితే అంతకంటే తక్కువ బిల్లు వచ్చేలా విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారు. విజిలెన్స్ అధికారుల పరిశీలనలో ఈ తంతు వెలుగుచూసింది. ఇలా కొన్ని వేల యూనిట్లు విద్యుత్తు అక్రమంగా వినియోగించినట్లు నిర్ధారణ అయింది. దీనిపై విజిలెన్స్ అధికారుల దర్యాప్తు చేస్తున్నారని తారానగర్ ఏఈ సుమన్ చెప్పారు. ఇంత తక్కువ బిల్లులు వస్తున్న విషయం మీ సిబ్బంది ఎందుకు పసిగట్టలేకపోయారు అని అడిగితే.. సమాధానం దాటవేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..