అయితే కల్తీ లేదా అశుభ్రత.. బయటి ఫుడ్ తినాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన పలు సంఘటనలు చూస్తుంటే బయటి ఫుడ్ తినాలి అంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది. ఏదో చిన్నాచితన ఊరుపేరు హోటల్స్‌లో నాణ్యత లోపిస్తోందని అనుకుంటే పొరబడినట్లే. ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న రెస్టారెంట్స్‌లో కూడా నాణ్యతను గాలికి వదిలేస్తున్నారు.
అధికారులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా, పర్యవేక్షణ చేపడుతోన్న కొందరు నిర్వాహకుల తీరుమాత్రం మారడం లేదు. తాజాగా హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్ బిర్యానీలో ఏకంగా బొద్దింక ప్రత్యక్షమైంది. హైదరాబాద్ కొత్తపేటలోని కృతుంగ రెస్టారెంట్‌లో బిర్యానీ తిందామని కొంత మంది వెళ్లారు. బిర్యానీ ఆర్డర్ ఇచ్చి తీరా తిందామని చూసే సరికి అందులో బొద్దింక కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఇదేంటని అడిగితే హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. దీంతో కస్టమర్లకు ఆందోళనకు దిగారు, యాజమాన్యం తీరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..