ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో విజయం సాధించిన తర్వాత టీమిండియా ఇప్పుడు కాన్‌బెర్రా చేరుకుంది. అక్కడ నవంబర్ 30 నుంచి ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో 2 రోజుల వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ను కలిశారు.
Australia Prime Minister Anthony Albanese Meets Team India Players
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా తొలి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. పెర్త్‌లో జరిగిన టెస్టులో టీమిండియా విజయం సాధించి టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. టీం ఇండియా ఇప్పుడు డిసెంబర్ 6 నుండి అడిలైడ్‌లో తదుపరి టెస్ట్ ఆడాల్సి ఉంది. అయితే అంతకంటే ముందు, ఈ మ్యాచ్‌కు సిద్ధమయ్యేందుకు ఈ జట్టు నవంబర్ 30 నుండి రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ టీమిండియా ఆటగాళ్లతో సమావేశమయ్యారు. కాన్‌బెర్రాలో జరిగిన ఈ సమావేశంలో విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాలను చూసి చాలా ఎగ్జైట్ అయ్యాడు.
ఆంథోనీ అల్బనీస్ టీమ్ ఇండియా ఆటగాళ్లతో సరదాగా కాసేపు మాట్లాడాడు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ప్రశంసించాడు. విరాట్ ఆయన మధ్య ఫన్నీ సంభాషణ జరిగింది. ఎలా ఉన్నారు పెర్తలో మంచిగా ఆడారు. ఇప్పటికే మా జట్టు ఇబ్బందుల్లో ఉంటే మీరు అది సరిపోదనట్లు సెంచరీ చేశారు అని ఆయన అనగా..అందుకు విరాట్ ఫన్నీ కౌంటర్ ఇచ్చాడు. పోటిలో కొంచెం మసాలా కలపాలి కదా అంటూ విరాట్ బదులిచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా ఆటగాళ్లందరీని ఆస్ట్రేలియా ప్రధానికి పరిచయం చేశాడు. ఆంథోనీ అల్బనీస్ గత రెండు సంవత్సరాలుగా ఆస్ట్రేలియా ప్రధానిగా ఉన్నారు. ఆస్ట్రేలియాకు భారతదేశంతో కూడా ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి.
Australian Prime Minister Anthony Albanese meets the Indian Cricket Team astatine Parliament House, chatting with Jasprit Bumrah and Virat Kohli. #ausvind #BGT2024@SBSNews pic.twitter.com/iyPJINCR7R
— Naveen Razik (@naveenjrazik) November 28, 2024
ఆంథోనీ అల్బనీస్ ప్రధాని మోదీకి మంచి స్నేహితుడు. ఆయన ప్రధాని అయిన తర్వాత ఆస్ట్రేలియా, భారత్ మధ్య సంబంధాలు చాలా మెరుగుపడ్డాయి. ఢిల్లీలోని అక్షరధామ్ టెంపుల్‌తో ఆంథోనీ అల్బనీస్‌కి ప్రత్యేక సంబంధం ఉంది. 2018 సంవత్సరంలో ఆంథోనీ అల్బనీస్ భారతదేశానికి వచ్చాడు. అప్పుడు ఆయన ప్రధాని పదవి చేపట్టలేదు. భద్రత లేకుండా ఒంటరిగా అక్షరధామ్‌కు వెళ్లానని ఆంథోనీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఢిల్లీ మెట్రో నుంచి అక్షరధామ్ టెంపుల్ వరకు ఆయన ప్రయాణించారు. ఆంథోనీ అక్షరధామ్ ఆలయాన్ని చూసిన తర్వాత తనకు ఆ ఆలయం ఎంతోగాను నచ్చిందని అక్కడి ప్రజలను చాలా ప్రశంసించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి