India vs England, 3rd ODI: మూడో వన్డేలో ఇంగ్లాండ్ కు 357 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది. శుభ్‌మన్ గిల్ (102 బంతుల్లో 112 పరుగులు) సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ 52, శ్రేయాస్ అయ్యర్ 78, కేఎల్ రాహుల్ 40 పరుగులు చేసి జట్టు స్కోరును 350 దాటించారు.
ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 4 వికెట్లు పడగొట్టగా, మార్క్ వుడ్ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. గస్ అట్కిన్సన్, సాకిబ్ మహమూద్, జో రూట్ తలా ఒక వికెట్ పడగొట్టారు. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది.
ప్లేయింగ్ XI..
ఇవి కూడా చదవండి
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా మరియు అర్ష్‌దీప్ సింగ్.
ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, టామ్ బాంటన్, లియామ్ లివింగ్‌స్టోన్, గస్ అట్కిన్సన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్ మరియు మార్క్ వుడ్.