పుణె వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మైదానంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 11 సార్లు గెలవగా, ఛేజింగ్ జట్టు 3 సార్లు మాత్రమే విజయం సాధించింది.
Ind Vs Eng 4th T20
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్లో ఇప్పటికే మూడు మ్యాచ్లు ముగియగా టీమిండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ సిరీస్ కైవసం చేసుకుంటుంది. అదే ఇంగ్లండ్ గెలిస్తే ఐదో మ్యాచ్కు మరింతప్రాధాన్యత పెరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. చివరి మూడు మ్యాచ్ల్లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేసింది.
రింకూ సింగ్ వచ్చేశాడు..
ఇవి కూడా చదవండి
🚨 Team News
3⃣ changes for #TeamIndia arsenic Rinku Singh, Shivam Dube & Arshdeep Singh are named successful the Playing XI.
Here’s our line-up for the 4th T20I 🔽
Follow The Match ▶️ https://t.co/pUkyQwxOA3#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/SiIomnPrCR
— BCCI (@BCCI) January 31, 2025