జనవరి 22 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు సంబంధించి ఇరు జట్లను ఇప్పటికే ప్రకటించారు. ఆతిథ్య భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తుండగా, పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టుకు జోస్ బట్లర్ నాయకత్వం వహించనున్నాడు. ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జనవరి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు శనివారం (జనవరి 19) కోల్‌కతా చేరుకున్నాయి. కాగా మూడేళ్ల తర్వాత చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగుతుండటంతో ఈ మ్యాచ్‌కు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. దీనికి తోడు ఇంగ్లండ్‌పై టీమ్ ఇండియా టీ20 రికార్డు అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య మొత్తం 24 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత జట్టు 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 11 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలుపొందింది.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఎస్ఏ20 లీగ్‌లో పాల్గొంటున్న ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ కోల్‌కతాలో అడుగుపెట్టాడు. దీని తర్వాత, జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టులోని మిగిలిన సభ్యులు దుబాయ్ నుంచి కోల్‌కతా చేరుకున్నారు. టీమ్ ఇండియా నుంచి యువ ఆటగాళ్లు నితీష్ కుమార్ రెడ్డి, రింకు సింగ్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలు కోల్ కతా చేరుకున్నారు. కాగా సుమారు 14 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వస్తున్న మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యాతో కూడా కోల్ కతా చేరుకున్నారు. తొలి మ్యాచ్‌కు ముందు ఇరు జట్లు మూడు ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటాయి. రెండో టీ20 జనవరి 25న చెన్నైలో, మూడో టీ20 ఫిబ్రవరి 2న ముంబైలో జరగనుంది.
టీ20 సిరీస్ షెడ్యూల్
- తొలి టీ20 మ్యాచ్ – జనవరి 22, కోల్‌కతా
- రెండో టీ20 మ్యాచ్ – జనవరి 25, చెన్నై
- మూడో టీ20 మ్యాచ్ – జనవరి 28, రాజ్‌కోట్
- నాలుగో టీ20 మ్యాచ్ – జనవరి 31, పూణె
- ఐదవ T20 మ్యాచ్ – 2 ఫిబ్రవరి, ముంబై
టీ20 సిరీస్ కోసం ఇరు జట్లు
టీమ్ ఇండియా:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమ్మీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్).
ఇంగ్లండ్ జట్టు:
జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడెన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ .
విమానాశ్రయంలో ఇంగ్లండ్ క్రికెటర్లు..
🚨 England Cricket Team person Reached India for the 5 T20s and 3 ODIs.#INDvsENG pic.twitter.com/OPoiem5GYg
— Sheeza Khan (@Pmln_gulf92) January 18, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..