టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత విడాకులు తీసుకుని సుమారు మూడేళ్లు దాటింది. నాగ చైతన్య ఇప్పటికే రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే నటి సమంత మాత్రం సింగిల్‌గానే ఉంది. అయితే ఇప్పుడు సామ్ కూడా ప్రేమలో పడిందని గుస గుసలు వినిపిస్త్ఉన్నాయి. బాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడితో ఆమె లవ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. హిందీలో పలు సూపర్ హిట్ సినిమా, వెబ్ సిరీస్‌లకు దర్శకత్వం వహిస్తున్న దర్శకుడితో సమంత ప్రేమలో ఉందనే వార్తలు గతంలోనే వచ్చాయి. అయితే ఇటీవల సమంత కు వచ్చిన ఓ ఆడియో మెసేజ్ తో మరోసారి దర్శకుడితో డేటింగ్ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సమంత ఇటీవల ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంటర్వ్యూ మధ్యలో ఆమెకు వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. అది కూడా ఆడియో సందేశమే. ఇంటర్వ్యూ మధ్యలో ఉన్నప్పటికీ సమంత ఆ ఆడియో మెసేజ్ ఓపెన్ చేసి విన్నది. అంతే సామ్ ముఖం ఆనందంతో సిగ్గు మొగ్గలేసింది. పెదాలపై చిరునవ్వు నాట్యమాడింది. ఆ తర్వాత సామ్ మరింత హుషారుగా ఇంటర్వ్యూ కొనసాగించింది. అక్కడున్న వారి ప్రకారం.. ఓ ప్రముఖ దర్శకుడి నుంచే ఆ మెసేజ్ వచ్చింది. ఇంతకు అతను మరెవరో కాదు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఫేమ్ రాజ్ నిడుమోరు.
ఇవి కూడా చదవండి
రాజ్, డీకే తెరకెక్కించిన ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ వెబ్ సిరీస్ లలో సామ్ నటించింది. దీంతో రాజ్‌తో సమంత డేటింగ్‌లో ఉందంటూ గతంలో పుకార్లు వచ్చాయి. రెండు వెబ్ సిరీసుల్లో వీరిద్దరు కలిసి పనిచేయడం వల్లే ఇలాంటి రూమర్స్ వచ్చాయన్నారు. అయితే ఇప్పుడు ఓ ఇంటర్వ్యూ లైవ్ లో సమంతకు స్వయంగా రాజ్ నుంచి మెసేజ్ వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రాజ్ పంపినట్లు చెబుతున్న ఆడియో మెసేజ్‌లో అసలు ఏముందో తెలియరాలేదు.
కాగా రాజ్ నిధిమోరు ప్రముఖ దర్శకుడు. అంతకుముందు టీవీ ఎపిసోడ్లకు స్క్రీన్ ప్లే రాసేవాడు. సమంత నటించిన తొలి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్2’కు దర్శకత్వం వహించాడు. అంతే కాకుండా ‘గన్స్ అండ్ గులాబ్స్’, ‘ఫర్జీ’ మరికొన్ని వెబ్ సిరీస్‌లకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సమంత నటిస్తున్న ‘రక్త బ్రహ్మాండం’ అనే వెబ్ సిరీస్‌కి ఆయనే నిర్మాత. కాగా, రాజ్‌కి ఇప్పటికే వివాహమైంది.
జిమ్ లో సమంత వర్కౌట్స్..
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి