Champions Trophy 2025: వైస్ కెప్టెన్సీపై రోహిత్ vs గంభీర్! గిల్ బదులు ఆ స్టార్ ప్లేయర్‌ను ప్రతిపాదించిన కోచ్!

3 hours ago 2

ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించారు. శనివారం (జనవరి 18) మధ్యాహ్నం 12.30 గంటలకు టీమిండియా ప్రకటన కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ.. మధ్యాహ్నం 3 గంటలకు భారత జట్టు ప్రకటన వెలువడింది. ఈ విధంగా, టీమిండియా ప్రకటన ఆలస్యం కావడానికి ప్రధాన కారణం రోహిత్ శర్మ, కోచ్ గౌతం గంభీర్ మధ్య విభేదాలే అని ఇప్పుడు తేలింది. సెలక్షన్ కమిటీతో చర్చించిన తర్వాత రోహిత్ శర్మ భారత జట్టును ఎంపిక చేశాడు. ఈ జాబితాతో సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్, రోహిత్ శర్మ మధ్యాహ్నం 12 గంటలకు వాంఖడే స్టేడియంలోని విలేకరుల సమావేశ గదికి చేరుకున్నారు. అయితే టీమ్ ఇండియా ఇంకా ఏం ప్రకటిస్తుందనే విషయంపై తెరవెనుక తీవ్ర చర్చ జరిగింది. ఈ చర్చల మధ్య గౌతమ్ గంభీర్ హార్దిక్ పాండ్యాను టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయాలని పట్టుబట్టినట్లు సమాచారం. కానీ అజిత్ అగార్కర్, రోహిత్ శర్మలు శుభ్‌మన్ గిల్ పేరును ప్రతిపాదించారు. అలాగే అగార్కర్ తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేనన్నారు. దీంతో ఫైనల్ గా గిల్‌నే వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

కాగా టీమిండియా వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌కు స్థానం కల్పించాలని గౌతమ్ గంభీర్ డిమాండ్ చేశాడు. కానీ రోహిత్ శర్మ మాత్రం రిషబ్ పంత్‌ పేరును ప్రకటించాడు. అజిత్ అగార్కర్ కూడా రిషబ్ పంత్ ఎంపికను సమర్థించాడు. ఇలా రెండున్నర గంటల పాటు సాగిన ఈ చర్చలో ఎట్టకేలకు రోహిత్ శర్మ తనకు కావాల్సిన జట్టును ఎంపిక చేసుకోవడంలో సఫలమయ్యాడు. ఇప్పుడు హిట్‌మ్యాన్ కోరిక మేరకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ బలమైన జట్టును ప్రకటించారు. అయితే ఈ సుదీర్ఘ చర్చ కారణంగా ఇప్పుడు కోచ్ గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యస్సవి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్..

Check retired the afloat fixtures for the ICC Champions Trophy 2025. pic.twitter.com/oecuikydca

— ICC (@ICC) December 24, 2024

టీమిండియా మ్యాచ్ ల వివరాలు..

Here’s Team India’s docket for the breathtaking ICC Champions Trophy 2025! 🏆🇮🇳

They footwear disconnected their run against Bangladesh successful Dubai connected February 20th! 🤩#ChampionsTrophy #India #ODIs #RohitSharma #Sportskeeda pic.twitter.com/bDy05j0EPJ

— Sportskeeda (@Sportskeeda) December 24, 2024

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article