హైదరాబాద్, జనవరి 19: దేశ ప్రధాని నరేంద్ర మోదీతో ముచ్చడించడానికి ప్రతి యేటా పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమానికి దరఖాస్తు ఆహ్వానించగా ఊహించని విధంగా విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన వచ్చింది. పరీక్షా పే చర్చా 8వ సీజన్ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఏకంగా 3.5 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు అరకోటి మంది విద్యార్ధులు పరీక్షా పే చర్చ కార్యక్రమం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 21.07 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఏపీ SCERT డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమం కోసం ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఎక్కువగా పేర్లు నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు. అలాగే ప్రతి జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులందరూ ఒక్కొక్కరు ఒక్కో నిమిషం నిడివి చొప్పున వీడియో పంపితే కేంద్ర విద్యాశాఖకు పంపుతామని ఆయన సూచించారు. ఈ వీడియోలను పరిశీలించిన తర్వాత ఎంపికైన అభ్యర్ధుల వివరాలు వెల్లడిస్తారు. ఇలా వీడియో ద్వారా ఎంపికైన విద్యార్థులు కూడా ప్రధాని ప్రత్యక్ష కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపారు. మొత్తం విద్యార్ధుల్లో ప్రశ్నలు అడగడంలో ప్రతిభ కనబరచిన 8 మంది విద్యార్థుల్లో నలుగురు ఢిల్లీకి, మరో నలుగురిని ముంబయికి వెళ్లినట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిపోయిన పీజీ మెడికల్ సీట్లకు ఎంపికై వారి జాబితా విడుదల
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మిగిలిన పీజీ మెడికల్ కన్వీనర్, యాజమాన్య సీట్ల ప్రవేశానికి ఇటీవల దరఖాస్తులు కోరుతూ దరఖాస్తు విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు ముగిసే నాటికి మొత్తం1419 మంది విద్యార్ధులు అప్లై చేసుకున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. కన్వీనర్ కోటాలో 591 మంది, యాజమాన్య కోటాలో 828 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 69 మందిని అనర్హులుగా ప్రకటించారు. వీరంతా సంబంధిత పత్రాలతో తిరిగి దరఖాస్తు చేసుకుంటే ప్రాధాన్య క్రమంలో వారి పేర్లను ఉంచుతామని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.