ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతున్న ప్రదేశంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్టార్ 19లో గీతా ప్రెస్ టెంట్‌లోని ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు మంటలు చెలరేగాయి. సమీపంలోని 10 టెంట్లకు మంటలు వ్యాపించాయి. పోలీసులు, ఫైర్ ఫైటర్స్ ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను ఆర్పివేశారు. మరోవైపు ప్రమాదంపై యూపీ సీఎంకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు.
CM Yogi Adityanath - PM Modi
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతున్న ప్రదేశంలో గ్యాస్ సిలిండర్స్ బ్లాస్ అయ్యి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు దాటికి పలు గుడారాలు దగ్దమయ్యాయి. ఘటనా స్థలంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ టీం వెంటనే అలర్టయి.. మంటలను అదుపుచేశారు. విషయం తెలిసిన వెంటనే సీఎం యోగి ఆతిథ్యనాథ్ స్పాట్‌కు వచ్చి.. ఘటనాస్థలిని పరీశిలించారు. అధికారులు, ప్రత్యక్ష సాక్షులను అడిగి ప్రమాదంపై వివరాలు తెలుసుకున్నారు. ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు. పరిస్థితిని పరిశీలించిన ఆదిత్యనాథ్, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా పరిస్థితిని తెలుసుకుని అగ్నిప్రమాదంపై స్వయంగా సీఎం ఆదిత్యనాథ్‌తో ఆరా తీశారు. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాకు యాత్రికులు భారీగా తరలివస్తున్నారు. జనవరి 18 నాటికి 77.2 మిలియన్లకు పైగా భక్తులు కుంభమేళాలో పాల్గొన్నారు. ఆదివారం ఒక్కరోజే 46.95 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరించారు.