చలి కాలంలో ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ ఫుడ్స్ తినడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. దీంతో ఎలాంటి వ్యాధులు, రోగాలను అయినా తట్టుకునే శక్తి వస్తుంది. ఇలా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాల్లో పుట్ట గొడుగులు కూడా ఒకటి. వీటితో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకుంటూ ఉంటారు. మష్రూమ్స్ తినడం వల్ల బీపీ, షుగర్ అనేవి అదుపులో ఉంటాయి. మష్రూమ్స్‌తో కేవలం వంటలే కాకుండా సూప్ కూడా తయారు చేసుకోవచ్చు. సాధారణంగా ఇవి రెస్టారెంట్లలో లభిస్తాయి. అదే రుచితో ఇంట్లో కూడా మష్రూమ్ సూప్ తయారు చేసుకోవచ్చు. మష్రూమ్స్ అంటే ఇష్టం ఉండేవారు ఒకసారి ట్రై చేయండి. చలి కాలంలో ఇలాంటి సూప్స్ తాగుతూ ఉండాలి.
మష్రూమ్ సూప్‌కి కావాల్సిన పదార్థాలు:
మష్రూమ్, బటర్, ఉల్లిపాయ తరుగు, స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు, అల్లం వెల్లుల్లి గరుతు, కార్న్ ఫ్లోర్ పౌడర్, వాము, ఫ్రెష్ క్రీమ్, క్యారెట్ తరుగు, మిరియాల పొడి, కొత్తిమీర, ఉప్పు.
మష్రూమ్ సూప్ తయారీ విధానం:
ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా బటర్ వేసి అందులో కార్న్ ఫ్లోర్ వేసి వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో మరింత బటర్ వేసి మష్రూమ్స్ వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఉల్లి తరుగు, అల్లం, వెల్లుల్లి తరుగు, క్యారెట్ తరుగు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి అంతా ఓ పది నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాము లేదంటే వాము పేస్ట్ వేసి మొత్తం కలపాలి.
ఇవి కూడా చదవండి
ఇవన్నీ వేగాక నీటిలో కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి చిన్న మంట మీద ఉడికించాలి. ఆ తర్వాత కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసి అంతా కలపాలి. సూప్ దగ్గర పడుతున్న సమయంలో కొద్దిగా మిరియాల పొడి, కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే టేస్టీ మష్రూమ్ సూప్ సిద్ధం. ఈ చలి కాలంలో వేడి వేడిగా తాగిలే భలే రుచిగా ఉంటుంది.