జీవిత భద్రతకు , భవిష్యత్తు అవసరాలకు పొదుపు చేయడం చాలా అవసరం. ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేయడం ద్వారా రిటైర్మెంట్ అనంతరం జీవితం సాఫీగా సాగిపోతుంది. పని చేయడానికి శరీరం సహకరించని సమయంలో అండగా ఉంటుంది. అయితే రిటైర్మెంట్ నాటికి ఎంత సొమ్ము పొదుపు చేయాలనేది వారి వారి ఆదాయాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు నెలకు రూ.లక్ష సంపాదించే వ్యక్తి ఒక కోటి రూపాయలను పొదుపు చేయాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం.
Sip
Srinu |
Updated on: Feb 11, 2025 | 1:50 PM
రిటైర్మెంట్ నాటికి కోటి రూపాయలను పొదుపు చేయాలనుకోవడం చాలా పెద్ద లక్ష్యమే. నెలకు రూ.లక్ష సంపాదించే వ్యక్తి ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా కష్టబడాలి. అయితే తెలివైన పెట్టుబడి ఎంపిక, క్రమశిక్షణ కలిగిన పొదుపు వ్యూహంతో ఆ కలను సాకారం చేసుకోవచ్చు. కోటి రూపాయల మూలధనాన్ని పొదుపు చేయాలనుకునే లక్ష్యాన్ని సాధించుకోవడానికి ముందుగా ఎక్కడ పొదుపు చేయాలో నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం. మ్యూచువల్ ఫండ్స్ లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్లు (ఎస్ఐపీ) కాలక్రమేణా గణనీయమైన సంపదను అందజేస్తాయి. ధీర్ఘకాలంలో అధిక రాబడి పొందడానికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయి.
- కోటి రూపాయల మూలధనం సంపాదించడానికి ప్రతి నెలా ఎంత పొదుపు చేయాలనేది కూడా అత్యంత అవసరం. గణనీయమైన సంపదను పోగు చేయడం కోసం ప్రతి నెలా వచ్చే ఆదాయంలో 15 నుంచి 20 శాాతం వరకూ పెట్టుబడి పెడుతూ ఉండాలి. నెలవారీ పెట్టుబడి పెరుగుతుంటే, అనుకున్న లక్ష్యాన్ని చాలా వేగంగా చేరుకోవచ్చు. కాబట్టి నెలకు రూ.లక్ష సంపాదిస్తుంటే సుమారు 15 వేల నుంచి 20 వేలు పెట్టుబడి పెట్టాలి. ఉదాహరణకు ప్రతి నెలా రూ.15 వేలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టారనుకుందాం. అది 12 శాతం వార్షిక రాబడిని అందిస్తుంది. మీరు స్థిరమైన రాబడిని పొందుతూ ఉంటే 211 నెలల్లో మీకు రూ.కోటి లభిస్తుంది.
- కోటి రూపాయలు సంపాదించే క్రమాన్ని వేగవంతం చేయడానికి స్టెప్అప్ సిప్ ను ఎంపిక చేసుకోండి. మీ ఆదాయం పెరిగే కొద్దీ, మీ పెట్టుబడులు కూడా అలాగే పెరగాలి. ఏటా సిప్ మొత్తాన్ని పెంచుకుంటూ పోవడం చాలా అవసరం.
- స్టెప్ అప్ సిట్ కారణంగా రెండు విధాలుగా ప్రయోజనం కలుగుతుంది. పెరుగుతున్న ఆదాయాన్నిపెట్టుబడిగా చేసుకుంటూ పోతే ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఉపయోగపడుతుంది. పెరుగుతున్న ఆదాయాన్ని పెట్టుబడిగా మలచడం వల్ల అధిక రాబడిని పొందడానికి వేగవంతంగా అడుగులు పడతాయి.
- నెలకు రూ.15 వేలతో 12 శాతం వార్షిక రాబడితో సిప్ ను ప్రారంభించారనుకోండి. దాన్ని ఏటా ఐదు శాతం పెంచితే 186 నెలల్లో రూ.కోటి సేకరించవచ్చు. అదే ఏటా పది శాతం పెట్టుబడిని పెంచితే 166 నెలల్లోనే లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
- నెలకు రూ.20 వేల సిప్ తో పొదుపు ప్రారంభిస్తే, మ్యూచువల్ ఫండ్ ద్వారా 12 శాతం వార్షిక రాబడి పొందుతున్నారనుకోండి. ఏటా మరో ఐదు శాతం పెట్టుబడి పెంచుకుంటూ పోతే 164 నెలల్లోనే రూ.కోటి సంపాదించుకోవచ్చు.
- కోటి రూపాయల పెద్ద మొత్తాన్ని కూడపెట్టుకోవడానికి ఓర్పు, క్రమశిక్షణ చాలా అవసరం. సిప్ ల నుంచి తొందరపడి పెట్టబడులను ఉపసంహరించుకోకూడదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో కనీసం ఏడు నుంచి పదేళ్లు ఉంచినప్పుడు మంచి రాబడిని అందిస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి