యాపిల్ కంపెనీ త్వరలో తన సరికొత్త ఐఫోన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ SE 4 లేదా ‘ఐఫోన్ 16E’ పేరుతో దీన్ని ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. Apple రాబోయే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ iPhone SE 4 గురించి గత ఏడాది కాలంగా చర్చలు కొనసాగుతున్నాయి. అనేక లీక్‌లు, నివేదికలలో దీని ఫీచర్స్ గురించి అలాగే డిజైన్ గురించి వెల్లడవుతున్నాయి. ఐఫోన్ 16e పేరుతో కంపెనీ దీన్ని కూడా పరిచయం చేయవచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు దీని డిజైన్‌కి సంబంధించిన కొత్త విషయాలు తెరపైకి వచ్చాయి.
లీక్‌లను విశ్వసిస్తే.. ఐప్యాడ్ లతో పాటు మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ డివైజ్‌కు సంబంధించి కంపెనీ ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు అవుతున్నాయి. సోషల్ మీడియాలో సోనీ డిక్సన్, X (గతంలో ట్విట్టర్) వినియోగదారు, iPhone SE 4 డమ్మీ యూనిట్ ఫోటోలను పంచుకున్నారు. iPhone SE 4 వెనుక ప్యానెల్, సైడ్ ఫ్రేమ్ డిజైన్ ఈ ఫోటోలలో కనిపిస్తుంది. వెనుక ప్యానెల్ డిజైన్ ఐఫోన్ 4 లాగా కనిపిస్తుంది. ఫోన్‌లో సింగిల్ రియర్ కెమెరా సెన్సార్, దానితో పాటు ఫ్లాష్ లైట్ ఉంది. ఫోన్ రెండు వేర్వేరు రంగు వేరియంట్‌లు ఫోటోలు ఉన్నాయి. ఇది కనీసం రెండు రంగుల ఆప్షన్‌లలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. డమ్మీ యూనిట్‌లో ఆపిల్ లోగో కనిపించదు. కానీ డిజైన్‌ను చూస్తే దాని ఆపిల్ స్టైల్ స్పష్టంగా కనిపిస్తుంది.
సైడ్ ఫ్రేమ్ పైభాగంలో వాల్యూమ్ రాకర్ బటన్‌లు, దీని పైన, ఫోన్‌ను సైలెంట్, జనరల్ మోడ్‌కి మార్చడానికి స్లైడర్ బటన్ ఉంది. SIM ట్రే ఒక విభాగం దిగువన ఉంటుంది. ఈ ఫొటోలో ఫోన్ బ్యాక్, సైడ్ యాంగిల్ కన్పిస్తుంది. మొదటి చూపులో ఈ ఫోన్ ఐఫోన్ 14 మాదిరిగానే ఉంటుంది. గత కొన్ని నెలలుగా అనేక మీడియా కథనాల్లో కూడా ఇదే చర్చించారు. ఈ ఫోన్ వెనక భాగంలో టాప్ లెఫ్ట్ కార్నర్లో సింగిల్ కెమెరా, బ్యాక్ కెమెరా పక్కనే పెద్ద ఎల్‌ఈడీ ఫ్లాష్ లైట్ ఉంది. ఇది తక్కువ బ్రైట్‌నెస్‌లో మంచి ఫోటోలు తీసేందుకు సహాయపడుతుంది.
First look astatine the iPhone SE 4 Dummy pic.twitter.com/qL0COgmPPA
— Sonny Dickson (@SonnyDickson) January 16, 2025
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి