IPL Auction: ఖాతాలో రూ.51 కోట్లు..  కావాల్సింది 14 మంది ప్లేయర్లు.. వేలంలో కేకేఆర్ కన్ను వారిపైనే

2 hours ago 1

డిఫెండింగ్ ఛాంపియన్‌ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మెగా వేలంలో కీలక ఆటగాళ్లను దక్కించుకోవడం పై దృష్టి పెట్టింది.  నవంబర్ 24 మరియు 25 తేదీల్లో జెడ్డాలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేలంలో తమకు కావల్సిన 14 ప్లేయర్లను ఆ ప్రాంచైజీ దక్కించుకోవాల్సి ఉంది.

గత సీజన్‌లో MA చిదంబరం స్టేడియంలో జరిగిన  గ్రాండ్ ఫినాలేలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ని ఓడించి టైటిల్ ని అందించాడు ఆ జట్టు మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. లీగ్ దశలో కోల్‌కతా నైట్ రైడర్స్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచి, ఆ తర్వాత వారు క్వాలిఫైయర్ 1లో సన్‌రైజర్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్నారు. అయితే విచిత్రంగా కేకేఆర్ శ్రెయాస్ అయ్యర్ ని వదులుకుంది.

గౌతమ్ గంభీర్ గత సీజన్‌లో వారి మెంటార్‌గా వ్యవహరించాడు. కాగా ఇప్పుడు కేకేఆర్ ని వదిలిపెట్టిన గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ వ్యవహరిస్తున్నాడు. కాగా KKR ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. వేలంలో వారికి ఎటువంటి RTM లేదు.

శ్రేయాస్‌ని విడిచిపెట్టిన తర్వాత, రాబోయే సీజన్‌లో వరి జట్టును ఎవరు నడిపిస్తారన్నదానిపై ఓ క్లారీటి లేకుండా పోయింది.  ఇక ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న తరువాత నైట్ రైడర్స్ వద్ద 51 కోట్ల రూపాయల పర్స్ మిగిలి ఉంది.

KKR: రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా

రింకూ సింగ్ (రూ. 13 కోట్లు), వరుణ్ చకరవర్తి (రూ. 12 కోట్లు), సునీల్ నరైన్ (రూ. 12 కోట్లు), ఆండ్రీ రస్సెల్ (రూ. 12 కోట్లు), హర్షిత్ రాణా (రూ. 4 కోట్లు), రమణదీప్ సింగ్ (రూ. 4 కోట్లు)

KKR: విడుదల చేసిన ఆటగాళ్ల జాబితా

నితీష్ రానా, రహ్మానుల్లా గుర్బాజ్, శ్రేయాస్ అయ్యర్, జాసన్ రాయ్, సుయాష్ శర్మ, అంకుల్ రాయ్, వెంకటేష్ అయ్యర్, వైభవ్ అరోరా, కెఎస్ భరత్, చేతన్ సకారియా, అంగ్క్రిష్ రఘువంశీ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రహ్మాన్, గస్ అట్కిన్ సన్, షకీబ్ హుస్సేన్.

KKR: పాసిబుల్ ప్లేయింగ్ XI

సునీల్ నరైన్

ఓవర్సీస్ వికెట్ కీపర్

భారత బ్యాటింగ్

భారత బ్యాటర్

భారత బ్యాటర్

భారత ఆల్ రౌండర్

ఆండ్రీ రస్సెల్

వరుణ్ చక్రవర్తి

ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్

భారత స్పిన్నర్

హర్షిత్ రాణా

KKR తమ కీలక ఆటగాళ్లలో కొందరిని విడుదల చేసిన తర్వాత ఏర్పడిన ఖాళీలను పూరించడానికి కొందరు కీలక ఆటగాళ్ల కోసం ప్రయత్నించవచ్చు. కేకేటీర్ దక్కించుకోబోయే ఆటగాళ్ల అంచనా ఇలా ఉంది.

నరైన్ కు ఓపెనింగ్ భాగస్వామి

KKR ఫిల్ సాల్ట్‌ను విడుదల చేసిన తర్వాత, సునీల్ నరైన్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించగల మరొక హార్డ్ హిట్టర్ ను దక్కించుకునే పనిలో ఉంది. అయితే మళ్లీ ఫిల్ సాల్డ్ కోసం కేకేఆర్ ప్రయత్నించవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో ఈ ఇంగ్లిష్ బ్యాటర్ రాణించాడు. అతడి ఫామ్ దృష్ట్యా సాల్డ్ ఈ సారి వేలంలో అధిక ధర పలకవచ్చు. దీంతో సాల్ట్ రూపంలో KKR పర్స్ వాల్యూ పై గట్టిగానే ఎఫెక్ట్ పడవచ్చు.

KKR సాల్ట్ ని కొనలేకపోతే, IPL లో ఆడిన అనుభవం ఉన్న రహ్మానుల్లా గుర్బాజ్ కోసం వెళ్ళవచ్చు. కోల్‌కతా తమ సెటప్‌లో టామ్ బాంటన్‌ని తిరిగి తీసుకురావడానికి కూడా చూడవచ్చు. వారు భారత వికెట్ కీపర్ కోసం వెళ్లాలంటే, వారికి మహ్మద్ అజారుద్దీన్, ఇషాన్ కిషన్ లేదా జితేష్ శర్మ ఉన్నారు.

వారు బ్యాకప్‌గా స్పెషలిస్ట్ బ్యాటర్ కోసం వెతుకుతున్నట్లయితే, ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లు కొట్టిన ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన సాదిఖుల్లా అటల్ కోసం వెళ్ళవచ్చు. ఒమన్‌లోని మస్కట్‌లో జరిగిన పురుషుల ఎమర్జింగ్ ఆసియా కప్‌లో కూడా అటల్ టాప్ రన్-స్కోరర్.

పవర్ ఫుల్ పేసర్

షోయబ్ అక్తర్, షేన్ బాండ్, బ్రెట్ లీ, ట్రెంట్ బౌల్ట్, మోర్నీ మోర్కెల్, మిచెల్ స్టార్క్ ల వరకు నైట్ రైడర్స్ ప్రతి సీజన్ లో ఖచ్చితమైన ఫస్ట్ బౌలర్ ని తమ జట్టు లో భాగం చేసుకుంది. గత సంవత్సరం వారు స్టార్క్‌ను ఐపీఎల్ లోనే అత్యధిక ధరకు దక్కించుకున్నారు.  అయితే వేలానికి ముందు అతన్ని విడుదల చేశారు. గెరాల్డ్ కోయెట్జీ కొత్త బంతితో పాటూ డెత్ ఓవర్లలో కూడా ఎఫెక్టివ్ గ బౌలింగ్ చేయడంతో పాటూ బ్యాట్ తో కూడా చెలరేగగలడు. బంగ్లాదేశ్‌కు చెందిన తస్కిన్ అహ్మద్ కూడా మంచి పేస్ తో బౌలింగ్ చేయగలడు. ఇంగ్లండ్‌కు చెందిన గస్ అట్కిన్ సన్ KKR వెతకగల మరొక బౌలర్. భారత పేసర్లలో, వారు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతూ 150లలో నిలకడగా బంతులు వేయగలిగే ఉమ్రాన్ మాలిక్‌ని తీసుకోవచ్చు.

స్పిన్నర్ అవసరం

నైట్ రైడర్స్ గత 12 సంవత్సరాలుగా సునీల్ నరైన్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంది. అయితే నరైన్ చెలరేగకపోతే, అనుభవజ్ఞుడి స్థానంలో కెకెఆర్‌కి తమ జట్టులో ఒక శక్తివంతమైన విదేశీ స్పిన్నర్ అవసరం. అల్లా ఘజన్‌ఫర్ గత సీజన్‌లో నైట్ రైడర్స్‌లో భాగమయ్యాడు కాబట్టి ఆఫ్ఘన్ స్పిన్నర్‌ను తిరిగి తమ జట్టులోకి తీసుకుంటే వారు జాక్‌పాట్ కొట్టే అవకాశం ఉంది. నూర్ అహ్మద్ తనకు లభించిన కొద్ది అవకాశంలో గుజరాత్ జెయింట్స్ తరఫున రాణించాడు.. అతని కోసం కూడా కేకేఆర్ ప్రయత్నించవచ్చచు. భారత స్పిన్నర్‌లలో సుయాష్ శర్మను తిరిగి కొనుగోలు చేయవచ్చు.

 మిడిల్ ఆర్డర్

శ్రేయాస్ అయ్యర్, నితీష్ రానాలను విడుదల చేసిన తర్వాత, నైట్స్‌కు తమ మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేసే శక్తివంతమైన బ్యాటర్లు అవసరం. సర్ఫరాజ్ ఖాన్ అతని నిలకడ, IPLలో బహుళ జట్లకు ఆడిన అనుభవంతో KKR అతని కోసం ప్రయత్నించవచ్చు. మరో యంగ్‌ టాలెంట్ రఘువంశీని తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేయవచ్చు.

ఆండ్రీ రస్సెల్ బ్యాకప్

ఆండ్రీ రస్సెల్ నాణ్యమైన ఆల్ రౌండర్, కానీ అతను గాయాలకు గురయ్యే అవకాశముంది. అతను గాయపడితే, అతనిని స్థానాన్ని భర్తీ చేయగల నిజమైన ఆల్ రౌండర్ కేకేఆర్ కి అవసరం. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్ గుజరాత్ టైటాన్స్ తరపున ఆడడంతో పాటూ జాతీయ జట్టుకు కూడా నిలకడగా ఆడుతున్నాడు. ఇటీవల షార్జాలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతను అద్భుతంగా రాణించాడు. వేలంలో అతడిని కూడా కొనుగోలు చేయవచ్చు.

KKR ప్లేయింగ్ XI అంచనా

సునీల్ నరైన్, రహ్మానుల్లా గుర్బాజ్ (wk), సర్ఫరాజ్ ఖాన్, రమణదీప్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, గెరాల్డ్ కోయెట్జీ/గస్ అట్కిన్సన్, సుయాష్ శర్మ, హర్షిత్ రాణా

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article