ఐపీఎల్ లో ఇంగ్లాండ్ క్రికెటర్లకు మంచి రికార్డు ఉంది. గతంలో ఎంతో మంది ఆటగాళ్లు ఈ మెగా వేలంలో తమ సత్తా చాటారు. దీంతో రాబోవు ఐపీఎల్ మెగా వేలంలో ఇంగ్లీష్ క్రికెటర్లకు ప్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో ఎవరెవరు ఈ సారి మెగా వేలం ప్రభావం చూపబోతున్నారో ఓ సారి పరిశీలిద్దాం. ఐపీఎల్ 2025 వేలంలో వీరి బలాలు రికార్డులు ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించేలా ఉన్నాయి.
1. జోస్ బట్లర్ (Jos Buttler)
రాజస్థాన్ రాయల్స్ తరఫున పోటీపడ్డ జోస్ బట్లర్ ఐపీఎల్‌లో అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌గా నిలిచి 107 మ్యాచ్‌లలో 3,582 పరుగులు చేశాడు. అతని పవర్ హిట్టింగ్ పవర్‌ప్లేలో వేగంగా స్కోర్ చేయడంలో ఉపయోగపడుతుంది. బట్లర్ 2022 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్న రికార్డు కూడా కలిగి ఉన్నారు, అంతిమ ఓవర్లలో ఫినిషింగ్ సామర్థ్యాన్ని కూడా చూపించాడు. దీంతో ఇతగాడి కోసం వేలంలో పోటీ పడటం ఖాయం.
2. ఫిల్ సాల్ట్ (Phil Salt)
ఈ ఇంగ్లండ్ ఆటగాడు IPL 2024లో KKRలో నరైన్‌తో ఓపెనింగ్ చేసి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేయడంలో విజయవంతమయ్యాడు. ఈ సీజన్‌లో 12 ఇన్నింగ్స్‌లలో దాదాపు 40 సగటుతో, 182 స్ట్రైక్ రేట్ చొప్పున 435 పరుగులు చేశాడు. వికెట్ కీపింగ్ నైపుణ్యాలు కూడా అతనికి అదనపు బలంగా మారింది. దీంతో సాల్ట్ కూడా ఈసారి మంచి ప్రధాన్యతను దక్కించుకోబోతున్నాడు.
3. లియామ్ లివింగ్‌స్టోన్ (Liam Livingstone)
పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన లివింగ్‌స్టోన్, తన ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. 23 మ్యాచ్‌ల్లో 549 పరుగులు చేయడమే కాకుండా, 15 వికెట్లు కూడా తీశాడు. అతని పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ తో పాటూ వైవిధ్యమైన స్పిన్ బౌలింగ్ అతన్ని విలువైన ఆటగాడిగా నిలబెట్టాయి.
4. విల్ జాక్స్ (Will Jacks)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 2023లో ఆ జట్టులో చేరిన, గాయాల కారణంగా ఆడలేకపోకపోయాడు. 2024 సీజన్లో అదే ఫ్రాంచైజ్ కి ఆడిన జాక్స్ 8 మ్యాచ్‌లలో 32.85 సగటు, 175.57 స్ట్రైక్ రేట్‌తో 230 పరుగులు చేశాడు. అతను తన మొదటి IPL సెంచరీని కూడా నమోదుచేశాడు. పవర్‌ప్లేలో వేగంగా షాట్లు ఆడగలిగే సామర్థ్యం, ఆఫ్-స్పిన్ బౌలింగ్‌తో ఆల్‌రౌండ్ సామర్ధ్యం అతనికి ప్రత్యేకతను తీసుకువచ్చాయి. ఇతన్ని మళ్లీ ఆర్సీబీనే దక్కించుకునే అవకాశముంది.
5. సామ్ కరన్ (Sam Curran)
పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన కరన్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 49 మ్యాచ్‌ల్లో 677 పరుగులు తో పాటు 49 వికెట్లు తీశాడు. డెత్ ఓవర్లలో వేగవంతమైన బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ఫినిషర్ గా సత్తా చాటాడు. ఒకానొక సమయంలో అతను ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు కొనుగోలు చేయబడిన ఆటగాడు.
6. జానీ బెయిర్‌స్టో (Jonny Bairstow)
పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన బెయిర్‌స్టో 39 మ్యాచ్‌ల్లో 1,291 పరుగులు చేశాడు. 142.65 స్ట్రైక్ రేట్ నమోదు చేసిన బెయిర్ స్టో. పవర్ ప్లే లో చాలా విలువైన ఆటగాడు. టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌లో స్థిరత్వంతో పాటు వికెట్ కీపింగ్ నైపుణ్యాలు కూడా అతనికి అదనపు విలువను ఇస్తాయి.
ఈ ఆరుగురు ఇంగ్లాండ్ ఆటగాళ్లు వారి ప్రత్యేకతలతో ఐపీఎల్ 2025 వేలంలో హాట్ ఫేవరెట్స్‌గా నిలుస్తారు. ఇలాంటి ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు భారీగా బిడ్డింగ్ వేయడం ఖాయం.