ఐపీఎల్ 2025 మెగా వేలం లో పలువురు భారత క్రికెటర్లపై కోట్ల రూపాయల వర్షం కురుస్తుందని క్రికెట్ నిపుణలు అభిప్రాయపడ్డారు. అభిప్రాయ పడ్డారు. అందులో ఇషాన్ కిషన్ పేరు కూడా ఉంది. ఇప్పుడు అదే నిజమైంది. మెగా వేలంలో 26 ఏళ్ల ఇషాన్‌ను దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు పోటీ పడ్డాయి. అయితే చివరకు ఎస్ ఆర్ హెచ్ రూ11. 25 కోట్లకు ఇషాన్ కిషన్ ను సొంతం చేసుకుంది. ఇషాన్ కు ఐపీఎల్ మంచి రికార్డు ఉంది .టీమిండియా మ్యాచులు ఆడిన అనుభవం కూడా ఉంది . 2013 నుంచి ఇషాన్ జార్ఖండ్ జెర్సీలో దేశవాళీ క్రికెట్ ఆడాడు. 2016లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. గుజరాత్ లయన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తొలి సీజన్‌లో 5 మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించింది. తర్వాత ఏడాది 11 మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత 2018 ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ ఇషాన్ ను కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో 14 మ్యాచ్‌ల్లో 149.45 స్ట్రైక్ రేట్‌తో 275 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాతి సీజన్ లో సరిగ్గా ఆడలేదు. కఐపీఎల్ 2019లో 7 మ్యాచ్‌ల్లో 101 పరుగులు మాత్రమే చేశాడు ఇషాన్. అయితే ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ తరఫున ఇషాన్ అత్యధిక పరుగులు చేశాడు (14 మ్యాచ్‌ల్లో 516 పరుగులు). అయితే 2021 సీజన్ లో మళ్లీ నిరాశ పర్చాడు. 10 మ్యాచ్‌ల్లో 241 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ 2022లో ఇషాన్ మళ్లీ చెలరేగాడు. ఆ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 418 పరుగులు చేశాడు.
ఇక 2023 ఐపీఎల్‌కు ముందు కూడా ముంబై అతడిని 15.25 కోట్లకు అట్టిపెట్టుకుంది. ఈ సీజన్‌లో అతను 15 మ్యాచ్‌ల్లో 454 పరుగులు చేశాడు. గత ఐపీఎల్‌కు ముందు అతడిని ఎంఐ అట్టిపెట్టుకుంది. కానీ ఈసారి 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ ఆ పని చేయలేదు. ఫలితంగా ఇషాన్ వేలంలోకి వచ్చాడు. మరి ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తో 18వ ఐపీఎల్‌లో ఇషాన్ ఎలా రాణిస్తాడో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి
𝙄𝙉𝙍 11.25 𝘾𝙧𝙤𝙧𝙚 𝙛𝙤𝙧 𝙄𝙨𝙝𝙖𝙣 𝙆𝙞𝙨𝙝𝙖𝙣! 👍 👍#SRH person a last accidental connected that bid and they person Ishan Kishan connected board! 👏 👏#TATAIPLAuction | #TATAIPL | @ishankishan51 | @SunRisers pic.twitter.com/AOYfI1UN09
— IndianPremierLeague (@IPL) November 24, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.