భారతదేశంలోని ప్రజలు నిర్ణీత ఆదాయం దాటాక ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కోసారి పన్ను చెల్లింపులో విఫలమైతే చెల్లించాల్సి పన్నుకు వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. అయితే నిర్దిష్ట షరతులకు లోబడి పన్ను చెల్లింపుదారు చెల్లించాల్సిన వడ్డీని మాఫీ చేయడానికి లేదా తగ్గించడానికి ఆదాయపు పన్ను శాఖ పన్ను అధికారులను అనుమతించింది. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను చట్టంలోని ఆ కీలక సెక్షన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Income Tax
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 220 (2ఏ) ప్రకారం ఏదైనా డిమాండ్ నోటీసులో పేర్కొన్న పన్ను మొత్తాన్ని చెల్లించడంలో పన్ను చెల్లింపుదారు విఫలమైతే అతను/ఆమె చెల్లింపు చేయడంలో ఆలస్యమైన కాలానికి నెలకు 1 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ఈ చట్టం ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్ (పీఆర్సీసీఐటీ) లేదా చీఫ్ కమీషనర్ (సీసీఐటీ) లేదా ప్రిన్సిపల్ కమిషనర్ (పీఆర్సీఐటీ) లేదా కమిషనర్ ర్యాంక్ అధికారులకు చెల్లించాల్సిన వడ్డీ మొత్తాన్ని తగ్గించడానికి లేదా మాఫీ చేయడానికి అధికారం ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నవంబర్ 4న ఈ మేరకు సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఆ సర్క్యూలర్ ప్రకారం రూ. 1.5 కోట్లకు పైగా బకాయి ఉన్న వడ్డీని తగ్గించడం లేదా మాఫీ చేయడంపై పీఆర్‌సీసీఐటీ ర్యాంక్ అధికారి నిర్ణయం తీసుకోవచ్చు.
రూ. 50 లక్షల నుంచి రూ. 1.5 కోట్లకు పైబడిన వడ్డీకి సీసీఐటీ ర్యాంక్ అధికారి మాఫీ/తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటారు. అయితే పీఆర్‌సీఐటీ లేదా ఆదాయపు పన్ను కమిషనర్లు రూ. 50 లక్షల వరకు చెల్లించాల్సిన వడ్డీపై నిర్ణయం తీసుకోవచ్చు. సెక్షన్ 220(2ఏ) కింద చెల్లించాల్సిన వడ్డీని తగ్గించే లేదా మాఫీ చేసే అధికారం మూడు షరతులకు అనుగుణంగా ఉంటుంది. అసెస్సీకి ఆర్థిక ఇబ్బందులు, అసెస్సీ నియంత్రణకు మించిన పరిస్థితుల కారణంగా వడ్డీ చెల్లింపులో డిఫాల్ట్‌గా మారడంతో పాటు మదింపుదారుడు అతని నుంచి బకాయిపడిన ఏదైనా మొత్తాన్ని అంచనా వేయడానికి లేదా రికవరీకి సంబంధించిన విచారణలో సహకరించడం అనే నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకోవచ్చు.
సీబీడీటీ తీసుకున్న చర్యల కారణంగా సెక్షన్ 220 ప్రకారం మినహాయింపు లేదా వడ్డీని తగ్గించడం కోసం పన్ను చెల్లింపుదారు ద్వారా దరఖాస్తులను త్వరితగతిన ప్రాసెస్ చేసే వీలు కల్పిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చట్టంలోని సెక్షన్ 220 ప్రకారం వడ్డీని తగ్గించడం లేదా మాఫీ చేయడం కోసం అసెస్సీ కోరితే వెంటనే నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉంటుందంటున్నారు. ఈ చర్యలు వడ్డీ రాయితీని మంజూరు చేయడంలో పారదర్శకత, సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుందని చెబతున్నారు. మాఫీ మొత్తం ఆధారంగా ఇది వివిధ స్థాయిలలోని అధికారులకు త్వరిత నిర్ణయాలు తీసుకోవడానికి కేసుల్లో స్థిరత్వం పెంచడానికి కారణం అవుతాయని వివరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి