న్యూఢిల్లీ, అక్టోబర్ 30: దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయా(జేఎన్‌వీ)ల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ 9, 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జేఎన్‌వీ లేటరల్ ఎంట్రీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు కోరుతూ గతంలో ప్రకటన వెలువరించింది. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 650 నవోదయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సీట్లు ఈ ప్రవేశాలు చేపట్టనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు అక్టోబర్ 30వ తేదీతో తుది గడువు ముగుస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ రోజు ముగింపు సమయం లోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రంలో 24 నవోదయా విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిల్లో ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశ పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు వసతి, పుస్తకాలు ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు ఉంటాయి. ఆసక్తి కలిగిన వారు ఈ కింది జేఎన్‌వీ అధికారిక వైబ్‌సైట్ లింక్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టీ-శాట్ నెట్‌వర్క్‌లో పోటీ, అకడమిక్ పరీక్షల కోసం ప్రత్యేక ప్రసారాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్య, ఉద్యోగ, అకడమిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు టీ-శాట్ నెట్‌వర్క్ ద్వారా తెలంగాణ స్కిల్స్, అకడమిక్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ల ద్వారా ప్రత్యేకంగా వీడియో తరగతులు నిర్వహిస్తోంది. ఒకటి నుంచి పదోతరగతి, ఇంటర్ విద్యలతోపాటు పలు రకాల పోటీ పరీక్షలు, ఇతర విభాగాలకు చెందిన ప్రసారాలను టీ శాట్ ద్వారా వీక్షించవచ్చు. టీజీపీఎస్సీ గ్రూప్ 1, ఎస్‌ఎస్‌సీ, డీఎస్సీ, గురుకుల, పోలీసు పరీక్షలకు ప్రత్యేకంగా వీడియోలు రూపొందించి ప్రసారం చేస్తున్నారు. వివిధ సబ్జెక్టులపై నిపుణులు వివరించే తరగతులను అభ్యర్థులు సద్వివినియోగించుకోవాలని పేర్కొంది.