విరాట్ కోహ్లీ 2013లో RCB కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్నాడు. అప్పటి నుంచి వరుసగా 9 సీజన్లలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, 2021 సీజన్ తర్వాత విరాట్ జట్టు కెప్టెన్‌గా వైదొలిగాడు. కోహ్లి సారథ్యంలో RCB ఒక్కసారి మాత్రమే IPL ఫైనల్‌కు చేరుకుంది. తాజాగా ఆర్సీబీ ఫ్యాన్స్ ఎగిరిగంతేసే వార్త ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Virat Kohli Wants To Be Captain Of Rcb
IPL 2025 సీజన్‌లో ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడం అన్ని జట్టులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎవరిని రిటైన్ చేసుకోవాలి, ఎవరిని వదులుకోవాలని ప్రాంఛైజీలు తర్జన భర్జన పడుతున్నాయి. అయితే ఇది ఇలా ఉంటే ఆర్సీబీ అభిమానులకు షాకింగ్ వార్త ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో ఐపీఎల్‌లో బెంగళూరు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లి మరోసారి జట్టుకు సారథ్యం వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.
IPL రిటెన్షన్ గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ESPN-Cricinfo ఓ వీడియోలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2025 ఆర్సీబీ కెప్టెన్‌గా తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆర్సీబీ యాజమాన్యాన్ని విరాట్ కోరినట్లు పేర్కొంది. కోహ్లి వరుసగా 9 సీజన్లలో RCB కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ ఒక్క టైటిల్ కూడా గెలువకపోవడంతో 2021 సీజన్ తర్వాత కెప్టెన్‌గా తనే రాజీనామా చేశాడు. అప్పటి నుండి ఫాఫ్ డుప్లెసిస్ వరుసగా మూడు సీజన్లలో జట్టు బాధ్యతలు చేపట్టాడు. వచ్చే సీజన్‌లో డుప్లెసిస్‌ను బెంగళూరు కొనసాగించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మెగా వేలం ద్వారా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లేదా శ్రేయాస్ అయ్యర్‌లలో ఒకరిని జట్టుకు కెప్టెన్‌గా చేయాలని RCB ప్రయత్నిస్తుందని మరో వాదన వినిపిస్తుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..