2004లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడులైన ఆనంద్ సూపర్ హిట్ గా నిలిచింది. ఫీల్ గుడ్ సినిమాలను అద్భుతంగా తెరకెక్కిస్తాడన్న పేరున్న శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా క్యాప్షన్ ‘ఒక మంచి కాఫీ లాంటి సినిమా’కు తగ్గట్టుగానే ఆనంద్ సినిమా నిజంగానే మనసుకు హత్తుకునే చిత్రం. ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా.. కేవలం కథ, స్క్రీన్ ప్లేతోనే ఆనంద్ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో రాజా, కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో కమిలిని పోషించిన రూప పాత్ర సినీ ఆడియెన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పేరెంట్స్ ను పోగొట్టుకుని ఫ్రెండ్స్ సాయంతో జీవిస్తూ ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయి పాత్రలో కమలినీ అద్భుతంగా నటించింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఆమెకు ఇదే మొదటి తెలుగు సినిమా. దీని తర్వాత శేఖర్ కమ్ముల సినిమా గోదావరితో కమలినీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇందులో ఆమె పోషించిన సీతామహాలక్ష్మి పాత్ర కూడా అందరినీ ఆకట్టుకుంది. వీటి తర్వాత స్టైల్, క్లాస్ మేట్స్, హ్యాపీ డేస్, పెళ్లైంది కానీ, జల్సా, గమ్యం, గోపి గోపిక గోదావరి తదితర సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించింది. అయితే చాలామంది హీరోయిన్లలాగే ఒకానొక దశలో కమలినీ నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొట్టాయి. దీంతో గోవిందుడు అందరివాడేలే, జగద్గురు ఆది శంకర వంటి చిత్రాల్లో సహాయక నటిగా కనిపించిందీ అందాల తార.
2016లో చివరిగా మన్యం పులి అనే సినిమాలో నటించింది కమలినీ ముఖర్జీ. ఆ తర్వాత మరే మూవీలోనూ కనిపించలేదు. దీని తర్వాత కొన్ని రోజుల పాటు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స తో టచ్ లో ఉంది. అయితే ప్రస్తుతం ఈ అందాల తార ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటుంది. ఆ మధ్యన తన సోదరీమణులతో కలిసి మిర్రర్ మిర్రర్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యింది కమలిని. ప్రస్తుతం ఆమె వ్యాపార రంగంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా గతేడాది డల్లాస్‌లో ఓ ఈ వెంట్‌కు హాజరైంది కమలిని ముఖర్జీ. అక్కడ ఆమెను చూసిన వారందరూ షాక్ అయ్యారు. సన్న జాజిలా ఉండే కాస్త బొద్దుగా మారడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. మరి చాలా మంది హీరోయిన్ల లాగానే ఈ ముద్దుగుమ్మ కూడా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్స్ చేస్తుందేమో చూడాలి.
ఇవి కూడా చదవండి
గతేడాది డల్లాస్ లో జరిగిన ఓ ఈవెంట్ లో కమిలినీ ముఖర్జీ..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.