కరివేపాకు తినడం ఆరోగ్యానికి మంచిదే. ఎక్కువగా జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు కరివేపాకును ఉపయోగిస్తూ ఉంటారు. కరివేపాకును అనేక వంటల్లో వేస్తూ ఉంటారు. కరివేపాకు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వెయిట్ లాస్ తగ్గించడంలో, షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడంలో కరివేపాకు చాలా మంచిది. కరివేపాకుతో ఎన్నో రకాల పొడులు కూడా తయారు చేస్తూ ఉంటారు. కరివేపాకుతో ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. కరివేపాకుతో ఎన్ని వంటలు చేస్తూ ఉంటారు. కరివేపాకుతో చేసే ఈ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఈ కరివేపాకు పచ్చడి ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కరివేపాకు పచ్చడికి కావాల్సిన పదార్థాలు:
కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి, బెల్లం తురుము, చింత పండు, ఉప్పు, ఆయిల్, తాళింపు దినుసులు, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు.
ఇవి కూడా చదవండి
కరివేపాకు పచ్చడి తయారీ విధానం:
ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి.. తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి కరివేపాకు దోరగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించి పక్కన పెట్టాలి. ఇవన్నీ చల్లారాక మిక్సీలో వేయాలి. ఇందులో ఓ రెండు వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టిన చింత పండు, ఉప్పు, కొద్దిగా బెల్లం తురుము వేసి కాస్త మెత్తగా మిక్సీ పట్టండి. అవసరం అయితే కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడికి ఇంగువ వేసి తాళింపు పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కరివేపాకు పచ్చడి సిద్ధం. వేడి వేడి అన్నంలో తింటే ఇది ఎంతో రుచిగా ఉంటుంది.