దేశంలో డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి. ప్రస్తుతం దేశంలో బొగ్గు ద్వారానే 72% విద్యుదుత్పత్తి జరుగుతోందన్నారు. ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతుండటం, పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతుండటంతో విద్యుదుత్పత్తి కూడా పెరుగుతోందన్నారు. ఒడిశాలోని కోణార్క్‌లో జరిగిన రాష్ట్రాల బొగ్గు, గనులశాఖ మంత్రుల మూడో జాతీయ సదస్సులో కేంద్రమంత్రి పాల్గొన్నారు.
దేశ జీడీపీలో బొగ్గు, గనుల రంగం భాగస్వామ్యం 2 శాతంగా ఉందన్నారు. బొగ్గు ఉత్పత్తి విలువ సుమారు 1.86 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 2024లో 997 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందన్నారు. 2014తో పోల్చుకుంటే ఏకంగా 76% మేర ఉత్పత్తి పెరిగిందని, 2030 నాటికి 1.5 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు కిషన్‌రెడ్డి. ఈ రంగంలో కొత్తగా 5 లక్షల ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు కిషన్‌రెడ్డి.
అక్రమ మైనింగ్‌ను నిరోధించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు కేంద్రం మైనింగ్ నిఘా వ్యవస్థను ప్రారంభించిందని, దీనిని అరికట్టేందుకు రాష్ట్రాల సహకారం తీసుకోవాలని కిషన్‌రెడ్డి కోరారు. గనుల రవాణా బిడ్డింగ్ ద్వారా 2015లో 55,636 కోట్లు రాగా, 2024లో రాయల్టీ రూపంలో రాష్ర్టాలకు రూ.2.69 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కీలకమైన ఖనిజాల అన్వేషణలో దేశం త్వరలో గ్లోబల్ లీడర్‌గా అవతరించనుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..