కోడి గుడ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఉడకబెట్టిన గుడ్లు ప్రతి రోజూ తినడం వల్ల అనేక రకాల లోపాలను తగ్గించుకోవచ్చు. శరీరం బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. పోషకాలు తప్పని సరి. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే గుడ్లు తింటే చాలు. చిన్న పిల్లలకు ప్రతి రోజూ ఓ ఉడకబెట్టిన గుడ్డ పెట్టడం వల్ల చాలా బలంగా తయారవుతారు. గుడ్లతో ఎన్నో రకాల వంటలు తాయరు చేస్తూ ఉంటారు. చాలా మందికి గుడ్లు ఫేవరేట్ ఫుడ్‌గా చెబుతారు. అయితే ఒక్కోసారి గుడ్లను ఉడికించేటప్పుడు కొన్ని పగిలిపోతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. పచ్చ సొన బయటకు వచ్చేస్తుంది. ఇలా ఉంటే గుడ్డు తిన్న ఫీలింగ్ ఉండదు. అయితే ఉడికించేటప్పుడు గుడ్లు పగిలిపోకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు ట్రై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెద్ద గిన్నెలు తీసుకోండి:
ఎప్పుడైనా సరే గుడ్లు ఉడికించేటప్పుడు పెద్ద గిన్నెలు తీసుకోండి. ఇలా చేయడం వల్ల గుడ్లు త్వరగా పగలకుండా ఉంటాయి. చాలా మంది చిన్న గిన్నెలు వాడుతూ ఉంటారు.
ముందుగానే నీళ్లు వేడి చేయండి:
చాలా మంది గుడ్లతో పాటు సహా నీళ్లు వేసి ఒకటేసారి ఉడికిస్తారు. అలా కాకుండా నీళ్లు ముందుగానే మరిగించి ఆ తర్వాత గుడ్లను వేయండి. ఇలా చేయడం వల్ల గుడ్లు త్వరగా పగలవు. గరిటె సహాయంతో గుడ్లను నీటిలో నెమ్మదిగా వదలండి.
ఇవి కూడా చదవండి
వెనిగర్ కలపండి:
వేడి నీళ్లలో కొద్దిగా వెనిగర్ కలిపి ఉడికించినా గుడ్లు పగలవు. పగుళ్లు వచ్చినా కూడా గుడ్లు బాగా ఉడుకుతాయి. ఈ ట్రిక్ చాలా మందికి ఉపయోగపడుతుంది. ముందుగానే నీటిలో వెనిగర్ కలిపి ఉడికించండి. దీని వల్ల పచ్చ సొన బయటకు లీక్ అయ్యే అవకాశం ఉండదు.
చలి కాలంలో గుడ్లు తింటే ఎన్నో లాభాలు:
చలి కాలంలో గుడ్లు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. చాలా మందికి ఈ సీజన్‌లో శరీర నొప్పులు ఎక్కువగా చేస్తాయి. అలా కాకుండా ఉండాలంటే గుడ్లు తింటే చాలు. ఉడికించిన గుడ్లు తినడం వల్ల త్వరగా చలి కూడా పెట్టదు. ఎందుకంటే గుడ్లు వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. చలి కాలంలో ఎక్కువగా అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే.. గుడ్లు తినడం మంచిది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.