Lack of Sleeping: ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల నిద్రలేకపోతే.. ఎన్ని నష్టాలో తెలుసా..? బీ అలర్ట్..

2 hours ago 2

మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, రోజూ తగినంత నిద్రపోవడం తప్పనిసరి. ప్రతి ఒక్కరికీ 7 నుంచి 8 గంటల నిద్ర తప్పని సరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది మన శరీరంలోని అనేక సమస్యలను సరిచేస్తుంది. మిమ్మల్ని ఫ్రెష్‌గా చేస్తుంది. మన జ్ఞానశక్తి సామర్థ్యానికి, జ్ఞాపకాలను ఏకీకృతం చేయడానికి, సమస్యలను పరిష్కరించడానికి మంచి నిద్ర ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు. 8 గంటలు నిద్రపోకపోవడం వల్ల ఎలాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందో ఇక్కడ తెలుసుకుందాం?

Jyothi Gadda

|

Updated on: Jan 19, 2025 | 7:44 AM

ఈ రోజుల్లో ప్రజలు చేస్తున్న పనుల కారణంగా తగినంత నిద్ర పొందలేకపోతున్నారు.. ఇది వారి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. దీనితో పాటు వ్యక్తి ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు తగినంత నిద్ర పొందకపోతే, అది అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. తగినంత నిద్ర లేకపోవటం వల్ల మనిషి శరీరంలో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ పెరుగుతుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. ఫలితంగా గుండెపై మరింత ఒత్తిడి కలిగిస్తుంది.

1 / 5

నిద్ర లేకపోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. జీవక్రియ తగ్గుతుంది. ఇది బరువు పెరుగుటకు దారితీస్తుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా ఊబకాయం పెరుగుతుంది. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో వాపు సమస్య మొదలవుతుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. దీన్ని నివారించడానికి, తగినంత నిద్ర తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

2 / 5

7 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. సరిగ్గా నిద్రపోకపోతే చిరాకు, కోపం, ఒత్తిడికి గురవుతారు. నిద్రలేమి కారణంగా మీరు ఉదయం అలసటతో మేల్కొంటారు. ఈ అలసట రోజంతా మీవెంటే ఉంటుంది. దీని వల్ల మీరు ఏ పనిపైనా దృష్టి పెట్టలేరు. మీ శరీరానికి తగినంత విశ్రాంతి లేకపోవడం వల్ల మీరు సరైనా నిర్ణయాలు కూడా తీసుకోలేరు.

3 / 5

అంతేకాదు.. నిద్ర లేకపోవడం వల్ల ప్రత్యక్ష ప్రభావం కళ్లపై కనిపిస్తుంది. శరీరంలో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది. చర్మం సున్నితంగా ఉండే ప్రదేశాలలో దీని ప్రభావం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఫలితంగా, కళ్ల కింద చారలు లేదా నల్లని వలయాలు, మచ్చలు ఏర్పడతాయి.

4 / 5

నిద్ర లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇది కాకుండా, హృదయ స్పందన కూడా పెరుగుతుంది. అందుకే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రోజూ 7-8 గంటలు నిద్రపోవాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి పోతుంది. ఇతర వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article