Lawrence Bishnoi: జైల్లో గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌కు భారీ సెక్యూరిటీ.. ఖర్చు ఎంతో తెల్సా..?

2 hours ago 1

గుజరాత్‌లోని సబర్మతి జైలు నుంచి ఖతర్నాక్‌ స్కెచ్‌లు గీస్తున్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ సెక్యూరిటీ కోసం ఏడాదికి ఎంత ఖర్చు చేస్తున్నాడో తెలుసా ? అక్షరాలా 40 లక్షల రూపాయలు.. లారెన్స్‌ బిష్ణోయ్‌ సెక్యూరిటీ కోసం అతడి కుటుంబమే ఈ డబ్బులు ఖర్చు చేస్తోంది. ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసులో మరోసారి లారెన్స్‌ బిష్ణోయ్‌ పేరు తెరపైకి వచ్చింది. భద్రతా కారణాలతో లారెన్స్‌ బిష్ణోయ్‌ను సబర్మతి జైల్లో పెట్టారు.. జైలు నుంచే అతడు గ్యాంగ్‌ను ఆపరేట్‌ చేస్తున్నాడు.. కెనడా వరకు నేరసామ్రాజ్యాన్ని విస్తరించాడు. ముంబైలోదావూద్‌ గ్యాంగ్‌కు పోటీగా తన గ్యాంగ్‌ను నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు లారెన్స్‌ బిష్ణోయ్‌..

లారెన్స్‌ బిష్ణోయ్‌ కుటుంబం ఎప్పటినుంచో సంపన్న కుటుంబమేనని అతడి బంధువులు చెబుతున్నారు. లారెన్స్ తండ్రి హర్యానా పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసినట్టు పేర్కొన్నారు. వారికి తమ గ్రామంలో 110 ఎకరాల భూమి ఉన్నట్టు తెలిపారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయ విద్యను పూర్తిచేసిన లారెన్స్ గ్యాంగ్‌స్టర్‌గా మారతాడని తాము ఊహించలేదన్నారు. అతడెప్పుడూ ఖరీదైన దుస్తులు, బూట్లు ధరించేవాడని చెబుతున్నారు. ఇప్పుడు జైల్లో ఉన్నప్పటికి లారెన్స్‌ బిష్ణోయ్‌కి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అతడి కుటుంబం జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే ఏడాదికి జైల్లో ఉన్నప్పటికి ఆయన కోసం రూ.40 లక్షలు ఖర్చు చేస్తున్నారు.

బిష్ణోయ్ అసలు పేరు బాల్కరన్ బ్రార్. పాఠశాలలో చదువుతున్న సమయంలో తన పేరును లారెన్స్ బిష్ణోయ్‌గా మార్చుకున్నాడు. యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలోనే లారెన్స్ చెడు బాట పట్టాడు. డీవీఏ కాలేజీ గ్యాంగ్‌వార్‌లో అతడి ప్రియురాలిని ప్రత్యర్థి వర్గం సజీవ దహనం చేయడంతో పూర్తిగా నేరాల బాట పట్టాడు. అనుచరుడు సంపత్ నెహ్రాతో కలిసి 2018లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ హత్యకు కుట్ర పన్నడంతో దేశవ్యాప్తంగా అతడి పేరు మార్మోగింది.

లారెన్స్ ప్రస్తుతం జైలులో ఉన్నప్పటికీ అక్కడి నుంచే తన నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడు. సింగర్ సిద్దూ మూసేవాలా, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీపై దాడులకు అక్కడి నుంచే ప్లాన్ చేసి హతమార్చాడు. బాబా సిద్దిఖీ హత్య కేసులో ఇప్పటి వరకు 10 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సల్మాన్‌ఖాన్‌కు అండగా ఉన్నాడన్న కోపం తోనే లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సిద్దిఖీని హతమార్చినట్టు ప్రాథమిక విచారణలో తేలింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article