అనారోగ్యం అంటే కేవలం శారీరక అనారోగ్యమేనని అనుకుంటాం. కానీ మారిన జీవన విధానం కారణంగా మానసిక అనారోగ్యాలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి వాటిలో ఒకటి సన్‌సెట్ యాంగ్జైటీ ఒకటి. ఇంతకీ ఏంటీ సన్ సెట్ యాంగ్జైటీ, అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది.? ఎలాంటి లక్షణాల ద్వారా దీనిని గుర్తించాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సాయంత్రం సూర్యుడు ఆస్తమిస్తున్న సమయంలో కొదరిలో ఒక్కసారిగా ఆందోళన పెరుగుతుంది. ఏదో తెలియని అభద్రత, భయం వెంటాడుతుంది. దీనినే సన్‌సెట్ యాంగ్జైటీగా పిలుస్తుంటారు. ఈ సమస్యకు ప్రధాన కారణాల్లో ఒంటరితనం, సమయం గడపడానికి ఎవరితోనూ లేకపోవడం ఒక కారణమని చెబుతున్నారు. అలాగే రోజతంగా బిజీ బిజీగా గడిపేసి సాయంత్రం కాగానే ఒంటరిగా కూర్చోవడం కూడా ఈ సమస్యకు ఒక కారణమని చెబుతున్నారు. ఇక చీకటి అవుతోన్న భయం కూడా కొందరిలో ఆందోళనకు కారణమవుతుంది.
సరైన రోజువారీ దినచర్య లేకపోవడం సూర్యాస్తమయం ఆందోళనకు కారణమవుతుందని అంటున్నారు. ఈ సమస్య కారణంగా సాయంత్రం కాగానే కొందరిలో గుండె దడ పెరుగుతుంది. మనసులో ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయి. చేతులు, కాళ్లలో వణుకు వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. సూర్యాస్తమయం సమయంలో విశ్రాంతి లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సాయంత్రం ఒంటరిగా ఉండకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్య నలుగురితో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సాయంత్రం కచ్చితంగా వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. సాయంత్రం సమయంలో ఖాళీగా ఉండకుండా పుస్తకాలు చదవడం, యోగా చేయడం వంటివి అలవాటు చేసుకోవాలి. మ్యూజిక్ వినడం, వంట చేయడం వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా స్నేహితులతో గడపాలి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..