లక్నో సూపర్ జెయింట్స్ తమ జట్టు కెప్టెన్ కెఎల్ రాహుల్‌కు మొండిచెయ్యి ఇచ్చింది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందుగా ప్రకటించిన రిటైన్ లిస్టులో రాహుల్ పేరు ఉండకపోవడం గమనార్హం. వెస్టిండీస్ విధ్వంసకర ప్లేయర్ నికోలస్ పూరన్‌ను
Lsg
లక్నో సూపర్ జెయింట్స్ తమ జట్టు కెప్టెన్ కెఎల్ రాహుల్‌కు మొండిచెయ్యి ఇచ్చింది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందుగా ప్రకటించిన రిటైన్ లిస్టులో రాహుల్ పేరు ఉండకపోవడం గమనార్హం. వెస్టిండీస్ విధ్వంసకర ప్లేయర్ నికోలస్ పూరన్‌ను రూ. 21 కోట్లతో అట్టిపెట్టుకున్న లక్నో.. ఐపీఎల్‌లో నాలుగు మ్యాచ్‌ల అనుభవమే ఉన్న మయాంక్ యాదవ్‌కు రూ.11 కోట్లు.. స్పిన్నర్ రవి బిష్ణోయ్‌తో రూ. 11 కోట్ల చొప్పున ఒప్పందం కుదుర్చుకుంది. అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఆయుష్ బదోని, మోహ్షిన్ ఖాన్‌లను రూ. 4 కోట్ల చొప్పున కూడా అట్టిపెట్టుకుంది. మూడేళ్లుగా లక్నో జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్‌పై యాజమాన్యం ఆసక్తి చూపించలేదు. దీంతో మెగా ఆక్షన్‌లో రాహుల్ దాదాపుగా రావడం ఖరారైంది.
రిటెన్షన్ లిస్ట్:
నికోలస్ పూరన్- రూ.21 కోట్లు
రవి బిష్ణోయ్- రూ.11 కోట్లు
మయాంక్ యాదవ్- రూ.11 కోట్లు
మోహ్షిన్ ఖాన్- రూ.4 కోట్లు
ఆయుష్ బదోని- రూ.4 కోట్లు
ఈ ఐదుగురు ప్లేయర్స్‌కు రూ. 41 కోట్లు కాగా.. పర్స్‌లో ఇక రూ. 69 కోట్లు మిగిలి ఉన్నాయి.
Say hullo to your starting five, Lucknow 👋 pic.twitter.com/ZWdfjOJxR4
— Lucknow Super Giants (@LucknowIPL) October 31, 2024
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..