హైదరాబాదీ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా పేరు ఈ మధ్యన బాగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందని, రాజకీయాల్లోకి వస్తుందని.. ఇలా తరచూ ఏదో ఒక రూమర్లు సానియాపైనే వస్తున్నాయి. అయితే ఈ టెన్నిస్ బ్యూటీ మాత్రం వీటిని అసలు లెక్క చేయడం లేదు.
Sania Mirza
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా ప్రస్తుతం తన ఫ్యామిలీతోనే ఎక్కువగా ఉంటోంది. టెన్నిస్ కు వీడ్కోలు పలికిన తర్వాత తన కుమారుడే తన ప్రపంచమైపోయాడు. ఇక పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడాకుల వ్యవహారంతో కొంత డిస్ట్రబ్ అయినప్పటికీ తన కుమారుడికి మంచి భవిష్యత్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. తాజాగా తన కొడుకు ఇజహాన్ ఆరో పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేసింది సానియా. అనంతరం కొడుకు బర్త్ డే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ‘నా చిన్నారి బాబూ.. నువ్వు ఆరేళ్ల వాడివి అయ్యావంటే అసలు నమ్మలేకపోతున్నా. నా నవ్వుకు నువ్వే కారణం. హ్యాపీ బర్త్‌డే మై లడ్డూ’ అంటూ కొడుకుపై తన కున్న ప్రేమకు అక్షర రూపమిచ్చింది సానియా. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అలాగే ఇజహాన్ బర్త్ డే ఫొటోస్ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు కూడా సానియా కుమారుడికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
సానియా కుమారుడి బర్త్ డే వేడుకలు..
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..