మెక్సికోలోని క్సలోజ్‌టోక్‌లోని స్టీల్ ప్లాంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోగా, ఒకరు గాయపడ్డారు. స్థానిక అధికారుల సమాచారం మేరకు వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. నగరానికి తూర్పున 140 కి.మీ దూరంలో ఉన్న అపిజాకోలో ఉదయం 3 గంటల తర్వాత అగ్ని ప్రమాదం జరిగినట్లు రాష్ట్ర పౌర రక్షణ తెలిపింది.
Fire Accident In Mexico
అమెరికాలోని మెక్సికో నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మెక్సికో ముస్సోరిలోని ఓ బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మెక్సికో నగరానికి తూర్పున 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న అపిజాకోలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మిస్సోరీలోని లిథియం బ్యాటరీ ప్లాంట్‌లో జరిగిన ఈ ప్రమాదంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలను భయపెట్టింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. సహాయక చర్యలు చేపట్టారు.
ప్రాథమిక సమాచారం ఆధారంగా.. కరిగిన ఉక్కు.. నీటిలోకి రావడంతో పేలుడు సంభవించి.. మంటలు చెలరేగినట్లు బ్యాటరీ ప్లాంట్‌లోని కార్మికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు..విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఎంక్వైరీ కంప్లీట్ అయ్యేవరకు ప్లాంట్‌ను మూసివేయనున్నట్లు తెలిపారు. అటు.. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసి.. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..