నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే.. నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమా నుంచి మోక్షజ్ఞ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. పవర్ ఫుల్ స్టోరీతో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా పై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. దాంతో ఈ సినిమా అసలు ఉంటుందా ఉండదా ఆ ని అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు జై హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.
జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఆతర్వాత ఇదే సిరీస్ లో వరుసగా సినిమాలు చేయనున్నాడు ప్రశాంత్. అయితే మోక్షజ్ఞ సినిమాను ఈగ్యాప్ లోనే తెరకెక్కిస్తాడని అంటున్నారు. ఇక ఈ సినిమా గురించి ఇప్పటికే రకరకాల వార్తలు వినిపించాయి. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కూతురు హీరోయిన్ గా నటిస్తుందని కూడా టాక్ వినిపించింది.
కాగా ఇప్పుడు అభిమానులు మరో హీరోయిన్ పేరు సజిస్ట్ చేస్తున్నారు. మోక్షజ్ఞ పక్కన ఈ అమ్మడు అయితే బాగుంటుంది అంటూ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంతకూ ఆబ్యూటీ ఎవరో తెలుసా.? మీనాక్షి చౌదరి. ఈ చిన్నదాని పేరు ఇప్పుడు టాలీవుడ్ లో గట్టిగానే వినిపిస్తుంది. వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ ను బిల్డ్ చేసుకుంటుంది ఈ చిన్నది. రీసెంట్ గా గోట్, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో హిట్స్ అందుకుంది. దాంతో ఇప్పుడు మోక్షజ్ఞ పక్కన మీనాక్షి అయితే బాగుంటుంది. ఈ కాంబో సెట్ చేయండి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఈ ఇద్దరి కాంబో సెట్ అవుతుందేమో చూడాలి.
ఫ్యాన్స్ రిక్వెస్ట్..
Combination acceptable cheyandi, adiripoddi.. 😍💥 pic.twitter.com/AIlFdn6YPn
— H A N U (@HanuNews) February 5, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి