Mahendra Singh Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై నాలుగేళ్లు దాటింది. ధోనీ ఇప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆడుతూనే కనిపిస్తున్నాడు. ఐపీఎల్ 2024లో కనిపించిన తర్వాత, ఐపీఎల్ 2025లో కూడా అతను సందడి చేయనున్నాడు. ఐపీఎల్ తదుపరి సీజన్ ప్రారంభానికి మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. అంతకంటే ముందే మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్‌కు సన్నాహాలు ప్రారంభించాడు. ధోనీ బ్యాట్ పట్టుకుని ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అతని బ్యాటింగ్ ప్రాక్టీస్ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఐపీఎల్ 2025 కోసం ధోనీ ప్రాక్టీస్..
మహేంద్ర సింగ్ ధోనీ వయసు 43 ఏళ్లు. గత ఐపీఎల్ సీజన్ తర్వాత ఇప్పుడు క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్ అవుతాడని అంతా భావించారు. అయితే, ధోని మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో కనిపించనున్నాడు. ఇందుకోసం ఆయన సన్నాహాలు కూడా మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోలో, ధోని బ్యాట్ పట్టుకుని యాక్షన్‌లో కనిపిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ పసుపు ప్యాడ్‌లు ధరించి హెల్మెట్ కూడా ధరించాడు. రెండు నెలల క్రితమే ధోనీ ఐపీఎల్ 2025 కోసం సన్నాహాలు ప్రారంభించాడు.
ఐపీఎల్‌లో ధోనీ 5 వేలకు పైగా పరుగులు..
THALA DHONI FOR IPL 2025 💛
– Dhoni has started the signifier up of the IPL 2025. pic.twitter.com/IJeq4EyIA9
— Johns. (@CricCrazyJohns) January 20, 2025
అంతర్జాతీయ క్రికెట్‌లో అఖండ విజయాన్ని సాధించడమే కాకుండా, మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్‌లో కూడా గొప్ప విజయాలు సాధించాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని భారత్‌ను గెలుచుకునేలా చేసిన ధోనీ.. CSK ఫ్రాంచైజీకి ఐదు IPL ట్రోఫీలను (2010, 2011, 2018, 2021, 2023) అందించాు. కెప్టెన్సీతో పాటు ఐపీఎల్‌లో బ్యాటింగ్‌లో అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. ఇప్పటివరకు 264 మ్యాచ్‌ల్లో 229 ఇన్నింగ్స్‌ల్లో 24 అర్ధ సెంచరీల సాయంతో 5243 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2025 మార్చి 21 నుంచి ప్రారంభం..
2008లో ప్రారంభమైన ఈ ఇండియన్ టీ-20 లీగ్ ఇప్పటి వరకు 17 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు 18వ సీజన్ మార్చి 21 నుంచి ప్రారంభం కానుంది. మరోసారి 10 జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో తొలి మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ కూడా జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..