మాస్ హీరో అనిపించుకోవాలని ప్రతి హీరోకీ ఉంటుంది. అలాగే నాగ చైతన్య కూడా మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని ఉవ్విళ్లూరుతూనే ఉన్నాడు. ఆ దిశగా చాలా అడుగులు వేస్తూనే ఉన్నాడు. కానీ మాస్ హీరోగా ఒక్కసారి కూడా హిట్ కొట్టలేకపోయాడు. అప్పుడెప్పుడో తడాఖాతో కాస్త ఓకే అనిపించినా.. ఆ తర్వాత ఏదీ వర్కవుట్ కాలేదు. ప్రేమకథలు మాత్రమే చైతూకు ఎప్పుడూ కలిసొచ్చాయి. ఇప్పుడు మరోసారి లవ్ స్టోరీతో వచ్చిన తండేల్‌తో హిట్ కొట్టేలాగే కనిపిస్తున్నాడు నాగ చైతన్య.
Naga Chaitanya
Praveen Vadla | Edited By: Janardhan Veluru
Updated on: Feb 07, 2025 | 5:59 PM
చాలా రోజులైపోయింది నాగ చైతన్య హిట్ అనే మాట విని..! ఈయన సినిమాలు వచ్చినవి వచ్చినట్లు పోతున్నాయే కానీ ఒక్కటి కూడా ఆడట్లేదు. దాంతో చైతూనే రెండేళ్లు బ్రేక్ తీసుకున్నాడు. కస్టడీ తర్వాత లాంగ్ గ్యాప్ ఇచ్చి తండేల్ అంటూ వచ్చాడు. ఈ సినిమా ఇప్పుడు విడుదలైంది. దీనికి వస్తున్న టాక్ విన్నాక కాస్త ఊరటపడ్డాడు నాగ చైతన్య. ముఖ్యంగా మ్యూజికల్‌కు తండేల్‌కు చాలా మంచి మార్కులు పడుతున్నాయి. మరోసారి లవ్ స్టోరీతో చైతూ సక్సెస్ అందుకున్నట్లే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. పైగా ఓపెనింగ్స్ కూడా బలంగానే కనిపిస్తున్నాయి. మొదటి మూడు రోజులు అయితే చైతూ భాషలో చెప్పినట్లే.. దుల్లగొట్టేయడం ఖాయం. ఆ తర్వాత కూడా సినిమా నిలబడిందంటే మాత్రం బ్లాక్‌బస్టర్ పక్కా.
మాస్ హీరో అనిపించుకోవాలని ఏ హీరోకు ఉండదు చెప్పండి..? అలాగే నాగ చైతన్య కూడా అటు వైపు చాలా అడుగులు వేస్తూనే ఉన్నాడు. కానీ ఒక్కసారి కూడా సక్సెస్ అనేది రావట్లేదు. అప్పుడెప్పుడో తడాఖాతో కాస్త ఓకే అనిపించినా.. ఆ తర్వాత ఏదీ వర్కవుట్ కాలేదు. ప్రేమకథలు మాత్రమే చైతూకు ఎప్పుడూ కలిసొచ్చాయి. ఇప్పుడు మరోసారి తండేల్‌తో హిట్ కొట్టేలాగే కనిపిస్తున్నాడు నాగ చైతన్య. అలాగని కేవలం లవ్ స్టోరీతోనే ముందుకు వెళ్లడం తనకు నచ్చదంటున్నాడు చైతూ. నటుడిగా తనకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంటుందంటున్నాడు.
తండేల్ సెట్స్‌పై ఉన్నపుడే విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండుతో ఓ సినిమా కమిట్ అయ్యాడు నాగ చైతన్య. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఇది డిఫెరెంట్ జోనర్‌లో రానుంది. వరస సినిమాలు చేస్తూనే.. మరోవైపు డిజిటల్ వైపు కూడా కన్నేసారు నాగ చైతన్య. దూత 2 సిరీస్ త్వరలోనే రానుంది. సీజన్ 1 పెద్ద హిట్ అవ్వడంతో.. సీజన్ 2ను ఇంకా భారీగా ప్లాన్ చేస్తున్నారు. దూత 2 కూడా సక్సెస్ అయితే.. మరికొందరు హీరోల చూపులు వెబ్ సిరీస్‌ల వైపు వెళ్ళడం ఖాయం.