అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 7న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. నిన్న తెల్లవారుజామున నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. విడుదలకు ముందే పాటలు, ట్రైలర్ ద్వారా అంచనాలు పెంచిన ఈసినిమా.. విడుదలయ్యాక భారీ రెస్పాన్స్ అందుకుంది.
Naga Chaitanya
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య రీసెంట్ గా తండేల్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ సినిమా శుక్రవారం ( ఫిబ్రవరి 7)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా.. నిజజీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. తండేల్ సినిమాలో న ఆగ చైతన్య మత్యకారుడిగా కనిపించారు.ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సిన్ ఈమెలో చైతన్య తన నటనతో కట్టిపడేసాడు. అలాగే నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అభిమానులు, చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వూలో నాగ చైతన్య మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో నాగ చైతన్య తన జీవితంలో జరిగిన విషయాలను కూడా పంచుకున్నారు. సమంతతో విడిపోవడం గురించి కూడా నాగచైతన్య మాట్లాడారు.
అలాగే పీఆర్ టీమ్ గురించి కూడా మాట్లాడారు నాగ చైతన్య. పీఆర్ గేమ్‌లోకి నేను చాలా లెట్ గా ఎంట్రీ ఇచ్చాను. సోషల్ మీడియాలో నేను అంతగా యాక్టివ్ గా ఉండను. సినిమా కోసం వర్క్ చేశామా.. ఇంటికి వెళ్లామా.. మన జీవితం మనం చూసుకున్నామా అన్నట్లు ఉంటా.. అన్నారు. నాకు ఎలాంటి రాజకీయాలు తెలియవు. గత రెండేళ్లుగా ఈ పీఆర్ హంగామా ఎక్కువైంది. ప్రతినెలా సుమారు రెండు, మూడు లక్షలు ఖర్చు పెట్టకపోతే నువ్వు సరైన దారిలో ఉన్నట్లు కాదు. సినిమా రిలీజ్ అవుతుందంటే పీఆర్ టీమ్ అవసరం. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాడనికి పీఆర్ కోసం ఖర్చు పెట్టాలి. సినిమా గురించి జనాలు మాట్లాడుకునేలా చేయాలి.. అందులో తప్పులేదు. కానీ కొందరు అనవసరంగా ప్రచారాలు చేస్తారు. పక్కనోడిని తొక్కేయాలని చూస్తుంటారు. అది ఎందుకు చేస్తారో అర్ధం కాదు. పక్కనోళ్లను ఇబ్బందిపెట్టే బదులు.. ఆ సమయాన్ని మన ఎదుగుదల కోసం ఉపయోగించుకోవడం.. ఆ డబ్బుతో ప్రశాంతంగా ఇష్టమైన టూర్స్ వెళ్లడం చేయొచ్చు కదా.. అని నాగ చైతన్య అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి