సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ నయనతార. విభిన్నమైన సినిమాలు.. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళంలో అనేక హిట్స్ అందుకున్న నయన్… కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. షారుఖ్ ఖాన్ సరసన జవాన్ మూవీతో అక్కడ సైతం భారీ విజయాన్ని అందుకుంది. ఈరోజు (నవంబర్ 19) నయనతార పుట్టినరోజు. ఈ సందర్భంగా నయన్ గురించి ఈ విషయాలు తెలుసుకుందామా. 2003లో మనసునక్కరే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది నయన్. ఆ తర్వాత సూర్య నటించిన గజిని మూవీలో మెరిసింది.
నెమ్మదిగా తెలుగు, తమిళంలో వరుస విజయాలను ఖాతాలో వేసుకుంది అగ్ర కథానాయికగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పటికే అందరూ టాప్ హీరోలతో జోడి కట్టింది. నయన్ నిత్యం తన వ్యక్తిగత విషయాలతోనే వార్తలలో నిలుస్తుంది. గతంలో శింబు, ప్రభుదేవాతో ప్రేమ, బ్రేకప్ సైతం జరిగింది. ఇక కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమ పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సైతం బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటుంది నయన్. ఇదిలా ఉంటే.. ఇప్పుడు నయన్ ఆస్తులు తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
నివేదికల ప్రకారం నయన్ ఆస్తుల మొత్తం రూ.183 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో రెండు ప్రీమియం అపార్ట్మెంట్స్, అందులో ప్రీమియం 5 స్టార్ హోటల్లోని సూట్లకు సమానమైన ఇంటీరియర్‌తో రూపొందించారట. అలాగే బంజారిహిల్స్లో ఈ రెండు అపార్ట్మెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వీటి విలువ దాదాపు రూ.15 కోట్లకు పైగానే ఉంటుందట. కేరళలో ఆమెకు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి, చెన్నైతోపాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లోనూ ఆమెకు ఆస్తులు ఉన్నాయట. నయన్ ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. ఈ బ్యూటీకి ప్రైవేట్ జెట్ కూడా ఉందట. 2023లో 9స్కిన్ అనే స్కిన్ కేర్ బ్రాండ్‌ను ఏర్పాటు చేసింది.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..
Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..
Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‌కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.