నిద్రపోయే సమయంలో ప్రతి ఒక్కరూ రకరకాల కలలు కనడం సహజం. ఈ కలలలో వ్యక్తి తన జీవితానికి సంబంధించిన అనేక రకాల విషయాలు, సంఘటనలను చూస్తాడు. డ్రీమ్ సైన్స్ లేదా స్వప్న శాస్త్రం ప్రకారం.. కొన్ని కలలు ఒక వ్యక్తి జీవితంలో జరగనున్న భవిష్యత్తు సంఘటనలను సూచిస్తాయి. కనుక కొన్ని కలలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి. రాత్రి సమయంలో కొన్ని కలలు కనడం వల్ల మనిషికి ఐశ్వర్యంతోపాటు అనేక రకాల సుఖాలు లభిస్తాయట. ఈ రోజు నిద్రలో ముఖ్యంగా తెల్లవారు జామున కొన్ని రకాల వస్తువులు కనిపిస్తే అది శుభమట. ముఖ్యంగా జీవితంలో డబ్బుకు లోటు ఉందని అర్ధం అట. ఈ రోజు శుభాలకు గుర్తులైన కలలుం ఏమిటో తెలుసుకుందాం..
కలలో వర్షం కనిపిస్తే
ఎవరికైనా వర్షం పడుతున్నట్లు కల వస్తే.. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో వర్షం కనిపించడం శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ కలకు అర్ధం ఏమిటంటే.. అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగ రావడం, పాత పెట్టుబడి లేదా పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనం పొందనున్నారని అర్ధం. అంతేకాదు వర్షం కురుస్తున్నట్లు కల వస్తే మనసులోని కోరికలన్నీ వీలైనంత త్వరగా నెరవేరుతాయి. ఇది కాదు కలలో వర్షం చూడటం ప్రేమ సంబంధాలలో బలాన్ని సూచిస్తుంది.
ఇవి కూడా చదవండి
కలలో మీ ముఖాన్ని మీరే చూడటం
కలలో అద్దంలో మీ ముఖాన్ని చూసుకుంటున్నట్లు కనిపిస్తే అది కూడా శుభ సంకేతం. ఇది మీ వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని కాపాడుతుంది. ఆఫీసులో పురోగతి, లాభం పాడే అత్యధిక అవకాశం ఉంది. పెళ్లికాని యువకుడు లేదా యువతి కలలో అద్దంలో తనను తాను చూసుకున్నట్లు కల వస్తే.. త్వరలో వీరి జీవితంలోకి ఒక ప్రత్యేక వ్యక్తి రాబోతున్నాడని అర్ధమట
గుర్రపు స్వారీ చేస్తున్నట్లు కల
కలలో గుర్రపు స్వారీ చేస్తూ చాలా దూరం ప్రయాణించడం శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. స్వప్న శాస్త్రం ప్రకారం త్వరలో సంపద, గౌరవం పొందుతారు అని అర్థం. మంచి ఉద్యోగ ఆఫర్లను పొందనున్నారని అర్ధం. పెండింగ్‌లో ఉన్న డబ్బు రికవరీ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి.
కలలో తమలపాకు తినడం
ఎవరి కలలో నైనా తమలపాకులను తింటున్నట్లు చూస్తే ఈ కల చాలా శుభవార్త విననున్నారని సూచిస్తుంది. ఇది ఆర్థిక లాభానికి, అదృష్టానికి సంకేతం. విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే మీ కోరిక వీలైనంత త్వరగా నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి.
కలలో జుట్టు లేదా గోర్లు కత్తిరించుకుంటే..
కలలో మీ జుట్టు లేదా గోర్లు కత్తిరించుకుంటున్నట్లు చూసినట్లయితే మీకు అకస్మాత్తుగా డబ్బు పొందబోతున్నారని అర్థం. అంతేకాదు మీ ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. అప్పుల నుంచి ఉపశమనం పొందనున్నారు.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.