అమరావతి, నవంబర్ 29: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోఎండీ, ఎంఎస్ పీజీ మెడికల్ నాన్ సర్వీస్ కేటగిరీ సీట్లకు నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తైంది. మొత్తం 1722 సీట్లు తొలి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ అయ్యాయని విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేర్కొంది. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా మెడికల్ కాలేజీల్లో డిసెంబరు 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా చేరాల్సి ఉంటుందని పేర్కొంది. ఫస్ట్ ఇయర్ పీజీ మెడికల్ తరగతులు డిసెంబరు 20వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని సూచించింది. సర్వీస్, యాజమాన్య సీట్ల ప్రవేశాల వివరాలు కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని అధికారులు పేర్కొన్నారు.
ఏఈ పోస్టుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన
తెలంగాణ ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీరు, టెక్నికల్ అధికారుల పోస్టుల భర్తీకి సంబంధించిన రెండో విడత మెరిట్ జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు నవంబర్ 28న ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించారు. వీరందరికీ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో పరిశీలన పూర్తి చేశారు. గైర్హాజరైన శుక్రవారం (నవంబర్ 29) నాడు ధృవపత్రాల పరిశీలకు హాజరుకావచ్చని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం టీజీపీఎస్సీ వెబ్‌సైట్ సందర్శించవచ్చు.
ఏపీపీఎస్సీ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్
ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) తాజాగా విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి