అన్నవాహిక క్యాన్సర్ లక్షణాలు.. బ్రిటన్ కు చెందిన NHS సంస్థ అన్నవాహిక క్యాన్సర్ కి సంబంధించిన కొన్ని లక్షణాలను పేర్కొంది. వీటిలో ఆరు లక్షణాలు తినేటప్పుడు కనిపిస్తాయట.
- మింగడంలో ఇబ్బంది (డిస్ఫాగియా)
- వికారం లేదా వాంతులు
- గుండెల్లో మంట లేదా యాసిడ్ రిఫ్లక్స్
- అజీర్ణం, ఎక్కువగా త్రేనుపులు రావడం
- ఆకలి లేకపోవడం లేదా బరువు తగ్గడం
- గొంతులో లేదా ఛాతీ మధ్యలో నొప్పి.. ముఖ్యంగా మింగేటప్పుడు
గుండెల్లో మంట అన్నవాహిక క్యాన్సర్ సాధారణ లక్షణాలలో ఒకటి. ప్రతిరోజు గుండెల్లో మంట వస్తుంటే లేదా మంటను తగ్గించడానికి మందులు వాడుతున్నా తగ్గకపోతే డాక్టర్‌ను కలవడం చాలా ముఖ్యం. డాక్టర్ షెరాజ్ మార్కర్ మాట్లాడుతూ.. నిరంతర యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంట అలాగే బారెట్ అన్నవాహిక ( కడుపులోని ఆమ్లం అన్నవాహిక లైనింగ్‌ను దెబ్బతీసినప్పుడు కణాలు పాడైపోవడం) అన్నవాహిక క్యాన్సర్‌కు ప్రధాన ప్రమాద కారకాలు.
బ్రిటన్ లో అన్నవాహిక క్యాన్సర్ తరచుగా వ్యాప్తి చెందిన తర్వాత కనుగొనబడుతుంది. దీని వలన చికిత్స చేయడం కష్టం అవుతుంది. అయితే రోగికి ఈ కాన్సర్ సోకిన ప్రారంభ రోజుల్లో కనుక గుర్తిస్తే మంచి చికిత్స ఎంపికలు ఉన్నాయి. గుండెల్లో మంటతో పాటు మింగడంలో ఇబ్బంది, కారణం లేని బరువు తగ్గడం, నిరంతర అజీర్ణం, వికారం లేదా వాంతులు వంటి లక్షణాలను గమనించాలి అని తెలిపారు.
- అన్నవాహిక క్యాన్సర్ ఇతర లక్షణాలు
- దగ్గు తగ్గకపోవడం
- గొంతు బొంగురుపోవడం
- నీరసం లేదా శక్తి లేకపోవడం
- నల్లటి మలం లేదా రక్తం దగ్గడం
ఈ లక్షణాలు క్యాన్సర్ వల్లనే వస్తాయని ఖచ్చితంగా చెప్పలేం. కానీ అవి నిరంతరం ఉంటే లేదా తీవ్రంగా ఉంటే వాటిని పరీక్షించడం మంచిది. ఈ సమాచారం ప్రజలకు అన్నవాహిక క్యాన్సర్ పట్ల అవగాహన పెంచడానికి.. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.