OnePlus Nord Buds 3: 43 గంటల బ్యాకప్‌.. వన్‌ప్లస్‌ నుంచి కొత్త ఇయర్‌ బడ్స్‌

2 hours ago 2

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌తో కస్టమర్లను ఆకర్షిస్తోంది. కేవలం స్మార్ట్‌ ఫోన్స్‌, ట్యాబ్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఇయర్‌ బడ్స్‌ను కూడా తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఇయర్‌ బడ్స్‌ లాంచ్‌ చేసింది. వన్‌ప్లస్ నార్డ్‌ బడ్స్‌3 పేరుతో ఈ ఇయర్‌ బడ్స్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఇయర్‌ బడ్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వన్‌ప్లస్ నార్డ్‌ బడ్స్‌3 ఇయర్‌ బడ్స్‌లో శక్తివంతమైన బ్యాటరీని అందించారు. వీటిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 43 గంటల బ్యాకప్‌ను అందించడం విశేషం. ఇక వీటిలో టైటానైజ్డ్ డయాఫ్రాగమ్‌ 12.4mm డైనమిక్ డ్రైవర్‌లను అందించారు. అలాగే ఇందులో BassWaveTM 2.0ని అందించారు. దీంతో బాస్‌ లెవల్స్‌ 2డీబీ వరకు పెరిగింది. పర్సనల్ మాస్టర్ EQ, 3D ఆడియో ఫీచర్ కూడా వీటిలో ప్రత్యేకంగా అందించారు.

వీటితోపాటు ఈ ఇబయర్‌ బడ్స్‌లో 32dB ANCతో కూడిన ట్రాన్సపరెంట్‌ మోడ్‌ను అందించారు. ఇది మెరుగైన కాలింగ్‌ అనుభవాన్ని అందించడంలో ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో డ్యూయల్-మైక్ సిస్టమ్, ఏఐ ఆధారిత అల్గారిథమ్‌ను ఇచ్చారు. ఈ ఇయర్‌ బడ్స్‌ బ్లూటూత్ 5.4, డ్యూయల్ కనెక్షన్, గూగుల్ ఫాస్ట్ పెయిర్ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది. వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌ కోసం ఇందులో ఐపీ55 రేటింగ్‌ను అందించారు. ఇక ధర విషయానికొస్తే రూ. 2,999గా నిర్ణయించారు. సెప్టెంబర్‌ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి తొలి సేల్ ప్రారంభమైంది.

Experience Bass-ed Brilliance with #OnePlusNordBuds3. Available now.

Get here: https://t.co/4jUJItsU7s pic.twitter.com/vMLhLcPhEC

— OnePlus India (@OnePlus_IN) September 20, 2024

ఈ ఇయర్‌ బడ్స్‌ ప్రముఖ ఈకామర్స్‌ సంస్థలు అమేజాన్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. 27వ తేదీ నుంచి జరగనున్న సేల్స్‌లో భాగంగా ఈ ఫోన్‌పై డిస్కౌంట్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఇకదిలా ఉంటే ఈ బడ్స్‌ను హార్మోనిక్ గ్, మెలోడిక్ వైట్ కలర్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article