Oscar 2025: ప్రతిష్ఠాత్మక ఆస్కార్ బరిలో ప్రియాంక చోప్రా సినిమా.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

4 hours ago 2

కొద్ది రోజుల క్రితం లాస్ ఏంజిల్స్‌లో అగ్నిప్రమాదాల కారణంగా ఆస్కార్ నామినేషన్లు వాయిదా పడ్డాయి. అయితే ఎట్టకేలకు గురువారం (జనవరి 23వ తేదీ) సాయంత్రం 7 గంటలకు నామినేటెడ్ చిత్రాల జాబితాను అకాడమీ ప్రకటించింది. ఇందులో ఓ భారతీయ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఈ చిత్రం పేరు అనూజ. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, గునీత్ మోంగాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ చిత్రం లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ పోటీలో నిలిచింది. ‘అనుజ’ సినిమాలో 9 ఏళ్ల బాలిక కథను చూపించారు. ఈ చిత్రానికి ఆడమ్ జె. గ్రేవ్స్ వహించారు. ఇది ఇండియన్-అమెరికన్ సినిమా. న్యూఢిల్లీలోని బట్టల మిల్లులో తన సోదరితో కలిసి పని చేసే తొమ్మిదేళ్ల అమ్మాయి అనూజ స్టోరీతో రూపొందించారు. బోర్డింగ్ స్కూల్లో చేరి, బాగా చదువుకోవాలని తపించే అనూజ చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని మోయాల్సి వస్తుంది. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న అనూజ బోర్డింగ్ స్కూల్లో చేరిందా? తన కలను నెరవేర్చుకోవడానికి ఆమె ఏం చేసింది? ఈ క్రమంలో ఆమెకు ఎదురైన సమస్యలేంటి? అనేది అనూజ మూవీలో చూపించారు.

కాగా అనూజ చిత్రంలో 9 ఏళ్ల సజ్దా పఠాన్ ‘అనుజ’ పాత్రను పోషించింది. సజ్దా గతంలో 2023లో వచ్చిన ‘ది బ్రెడ్’ చిత్రంలో కూడా నటించింది. అలా అనన్య షాన్‌భాగ్ ‘అనుజ’ సినిమాలో సజ్దా పఠాన్‌కి అక్కగా నటించింది. ఇది కాకుండా, ఈ షార్ట్ ఫిల్మ్‌లో నగేష్ భోంస్లే, గుల్షన్ వాలియా కూడా నటించారు. ‘అనూజ’ ఇప్పటి వరకు న్యూయార్క్ షార్ట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024, హాలీవుడ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ లైవ్ ఇన్ యాక్షన్ ఫిల్మ్, మోంట్ క్లైర్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డులను గెలుచుకుంది. ఇప్పుడు ఏకంగా ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యింది. దీంతో చిత్ర బృందం సంతోషంలో మునిగి తేలుతోంది.

ఇవి కూడా చదవండి

ప్రియాంక చోప్రా పోస్ట్..

కాగా అనూజ షార్ట్ ఫిల్మ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ ఆస్కార్ నామినేటెడ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది.

Anuja has been nominated for the 97th Oscars successful the Live Action Short Film category! ✨

The movie follows 9-year-old Anuja, a talented miss moving successful a garment mill successful Delhi. When she’s fixed a uncommon accidental to spell to school, she faces a life-changing decision—one that could… pic.twitter.com/4U4pWAi2TK

— IMDb India (@IMDb_in) January 23, 2025

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article