ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలో విడుదలైంది. లాక్ డౌన్ సమయంలో థియేటర్లకు బదులుగా రెండు ఓటీటీల్లోకి అందుబాటులోకి వచ్చింది. ఊహల్లో గర్ల్ ఫ్రెండ్ తో.. బెడ్ పై భార్యతో అలా.. భర్త చేసిన పనులకు విసిగిపోయిన భార్య చివరికి ఏం చేసిందో ఈ స్టోరీలో తెలుసుకుందామా..
Ott Movie
థియేటర్లలో విడుదలైన చిత్రాలు.. నాలుగు వారాల తర్వాత ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే ఓటీటీలకు ఫ్యాన్ బేస్ పెరిగిపోవడంతో.. పలు చిత్రాలైతే డైరెక్ట్ ఓటీటీల్లోకే వచ్చేస్తున్నాయి. అలా ఓ బెంగాలీ సినిమా నేరుగా ఓటీటీలోకి విడుదలైంది. ఈ మూవీ లాక్ డౌన్ సమయంలో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనలకు ఆధారంగా తెరకెక్కింది. మరి ఆ సినిమా ఏంటి.? కథ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందామా..
ఆ బెంగాలీ చిత్రం పేరు ‘తాషేర్ ఘౌర్’. ఈ మూవీ లాక్ డౌన్ టైంలో నేరుగా ఓటీటీలోకి విడుదలైంది. హోయిచోయ్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. కథ విషయానికొస్తే.. మీరా, రమేష్ భార్యాభర్తలు. ఇద్దరూ కొన్నేళ్లు అన్యోన్యంగానే ఉన్నారు. అయితే భార్యకు రెండుసార్లు అబార్షన్ కావడం, పిల్లలు పుట్టకపోవడంతో రమేష్ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఈ క్రమంలోనే వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. మీరాను టార్చర్ పెడుతుంటాడు. ఇదిలా ఉండగా.. మీరా అత్తకు అనారోగ్యం చేయడంతో మంచాన పడుతుంది. ఆమెకు భార్యతోనే సేవలు చేయిస్తాడు రమేష్. ఇక అత్త దగ్గర నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ భరించలేక.. స్లో పాయిజన్ ఇచ్చి.. కొన్ని రోజుల్లో చంపేస్తుంది మీరా. ఆ తర్వాత లాక్ డౌన్ రావడం.. భర్త వర్క్ ఫ్రమ్ హోం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక భార్యకు రోజుకో నరకం చూపిస్తుంటాడు రమేష్. చిన్న చిన్న విషయాలకే గొడవపడటం.. రాత్రుళ్లు భార్యకు తెలియకుండా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడటం లాంటివి చేస్తాడు. అలాగే రాత్రి బెడ్ రూమ్ లో భార్యతో గడిపేటప్పుడు గర్ల్ ఫ్రెండ్ ని ఊహించుకుంటాడు. ఇలా భర్త చేసిన ప్రతీ పనిపైనా మీరాకు ఎక్కడాలేని కోపం వస్తుంది. భర్తకు పెట్టే భోజనంలో ఎలుకల మందు కలుపుతుంది. చివరికి అతడు ఆ భోజనం తిన్నాడా.? మీరాకు స్వేచ్ఛ లభించిందా.? అసలు చివరికి మీరా ఏమైంది.? అనే విషయాల కోసం సినిమా చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి