మన దేశంలో జీతం పొందే ఉద్యోగులందరూ ఉద్యోగ భవిష్య నిధి పథకం (ఈపీఎఫ్)లో సభ్యులుగా ఉంటారు. ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పొదుపు పథకం. ప్రతినెలా ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం దీనిలో జమ అవుతుంది. యజమాన్యం కూడా అదే మొత్తంలో కలుపుతుంది. దీని ద్వారా ఆ ఉద్యోగి విరమణ అనంతరం పెద్ద మొత్తంలో సొమ్ము అందుతుంది. అత్యవసర సమయంలో మధ్యలోనూ కొంత తీసుకునే వీలుంటుంది.
Pf Balance Check
Srinu |
Updated on: Feb 11, 2025 | 1:34 PM
ఆన్ లైన్ లో పీఎఫ్ ఖాాతాలోని బ్యాలెన్స్ ను చెక్ చేసుకోవడం, అత్యవసర సమయంలో విత్ డ్రా చేసుకోవడంపై చాలా మందికి అవగాహన ఉండదు. ఈ కింది తెలిపిన పద్ధతులు పాటిస్తే చాలా సులభంగా ఆ ప్రక్రియను నిర్వహించుకోవచ్చు. పీఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్ లో ఆన్ లైన్ లో చాలా సులువుగా తనిఖీ చేసుకోవచ్చు. దాని కోసం మీ ఖాతాకు సంబంధించిన యూనివర్సల్ అక్కౌంట్ నంబర్ (యూఏఎన్) చాలా అవసరం. మీకు యూఏఎన్ లేకపోతే ముందుగా ఈ కింద తెలిపిన పద్ధతులతో సింపుల్‌గా చూడవచ్చు.
యూఏఎన్ యాక్టివేట్ కోసం
- ముందుగా ఈపీఎఫ్ వో వైబ్ సైట్ ను సందర్శించాలి.
- సర్వీసెస్ ట్యాబ్ కింద ఉన్న ఉద్యోగుల కోసం అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- సభ్యుడు యూఏఎన్ / ఆన్ లైన్ సర్వీస్ (వోసీఎస్/ఓటీసీపీ)ను ఎంపిక చేసుకోవాలి.
- యాక్టివేట్ యూఏఎన్ పై క్లిక్ చేయాలి, మొబైల్ నంబర్, పీఎఫ్ సభ్యుల ఐడీని అందించాలి.
- మీ యూఏఎన్ ని యాక్టివేట్ చేసుకోవడానికి సూచనలను అనుసరించాలి.
యూఏఎన్ యాక్టివేట్ అయిన తర్వాత..
- యూఏఎన్ నంబర్ యాక్టివేట్ అయిన తర్వాత సభ్యుడు యూఏఎన్ / ఆన్ లైన్ సేవలు అనే స్క్రీన్ కు తిరిగి వెళ్లండి.
- లాగిన్ కావడానికి మీ యూఏఎన్, పాస్ వర్డ్, కాప్చాను నమోదు చేయండి.
పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ తనిఖీ
- వెబ్ సైట్ లోకి లాగిన్ అయిన తర్వాత వీక్షణ అనే ట్యాబ్ ను ఎంపిక చేసుకోండి.
- పాస్ బుక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. దీంతో మీ ఖాతాలోని బ్యాలెన్స్, లావాదేవీలు ప్రత్యక్షమవుతాయి.
బ్యాలెన్స్ ఉపసంహరణకు..
- ఉద్యోగ విరమణ తర్వాత, వైద్య చికిత్స, ఉన్నత విద్య, ఇల్లు కొనుగోలు, రెండు నెలలుగా నిరుద్యోగిగా ఉండడం తదితర సమయాల్లో పీఎఫ్ ఖాతాలోని నగదును ఉపసంహరించుకోవచ్చు. దాని కోసం..
- ఈపీఎఫ్ వో పోర్టల్ కు లాగిన్ అవ్వాలి. ఖాతాను యాక్సెస్ చేయడానికి యూఏఎన్ నంబర్, పాస్ వర్డ్ ను ఉపయోగించాలి.
- ఆన్ లైన్ సేవలు అనే ఆప్షన్ లోకి వెళ్లి, క్లెయిమ్ (ఫారం 31, 19, 10సీ)ను ఎంచుకోండి.
- మీ బ్యాంకు ఖాతాలోని చివరి నాలుగు నంబర్లను నమోదు చేసి,వెరిఫై అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ప్రోసీడ్ ఫర్ ఆన్ లైన క్లెయిమ్ పై క్లిక్ చేసి, నేను దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నాను అనే డ్రాప్ డౌన్ కింద ఉప సంహరణ క్లెయిమ్ రకాన్ని ఎంచుకోండి.
- వివరాలను పూర్తి చేయండి, అవసరమైన పత్రాలను సబ్మిట్ చేయాలి.
- అన్ని వివరాలను సక్రమంగా ఉంటే పది నుంచి 20 రోజుల్లో మీ బ్యాంకు ఖాతాకు సొమ్ములు బదిలీ అవుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి