ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా భారతీయులు ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతర దేశాల్లో స్థిరపడ్డా భారతీయులు మన సంస్కృతిని, సంప్రదాయాలను మాత్రం వీడడం లేదు. మన పండుగలను విదేశాల్లో జరుపుకుంటున్నారు. ఇదే విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా ప్రస్తావించారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ విషయమై ఓ ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలో ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున ఆయనను కలవడానికి వస్తుంటారు. ఎయిర్ పోర్ట్‌లో మోదీ నామం మారు మోగే సందర్భాలు కూడా ఎన్నో చూసే ఉంటాం. ఇక భారతీయత ఉట్టిపడేలా అక్కడి ప్రజలు నిర్వహించే కార్యక్రమాలు ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి అద్భుత క్షణాలకు సంబంధించిన వీడియోను తాజాగా ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
ఈ వీడియోతోపాటు.. ‘భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది! నేను ఎక్కడికి వెళ్లినా, మన చరిత్ర, సంస్కృతి పట్ల నాకు అపారమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఇది చాలా సంతోషకరం’ అంటూ రాసుకొచ్చారు. మోదీ షేర్ చేసిన వీడియోలో.. ఆస్ట్రీయాకు చెందిన సంగీత కళాకారులు రకరకాల ఇస్ట్రుమెంట్స్‌తో ‘వందేమాతరం’ గీతాలపన చేయడం. పొలాండ్ మాస్కోలో గార్భా డ్యాన్స్, భూటాన్‌లో దాండియా.. ఇలా ఆయా దేశాల్లో భారతీయ సంస్కృతిని ఉట్టి పడేలా చేపట్టిన ఈవెంట్స్ ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..