మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు ఈ మూవీకి సంబంధించి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి. మంచు విష్ణు, మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, బ్రహ్మనందం, సప్తగిరి రఘు బాబు, ఐశ్వర్య రాజేష్, దేవరాజ్, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) ఇలా భారీ తారగణంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడన్న వార్త బయటకు రావడంతో డార్లింగ్ అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడని అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. కాగా ప్రభాస్ శివుడి పాత్రలో కనిపిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ ఆతర్వాత శివుడు పాత్రలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడని అనౌన్స్ చేశారు. తాజాగా పరమ శివుడుగా నటిస్తున్నాడని ప్రకటించారు. అలాగే అక్షయ్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. కాగా ప్రభాస్ ఎలాంటి పాత్రలో కనిపిస్తారా.? అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కన్నప్ప సినిమాలో ప్రభాస్ కు ఇంట్రో సాంగ్ ఉంటుందట. ఈ విషయాన్నీ తాజాగా ప్రముఖ కమెడియన్ హైపర్ లీక్ చేశాడు. తాజాగా హైపర్ ఆది గణేష్ మాస్టర్ గురించి చెప్తూ.. కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారు నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాలో ప్రభాస్ ఇంట్రో సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ కంపోజ్ చేసింది గణేష్ మాస్టర్ అనే హైపర్ అది హింట్ ఇచ్చాడు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ప్రభాస్ ఈ సినిమాలో ఏ పాత్రలో కనిపిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే .
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.