Rain Alert: వానలే.. వానలు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ వచ్చేసిందిగా..

1 hour ago 2

వర్షాలపై భారత వాతావరణ శాఖ ఆదివారం కీలక ప్రకటన చేసింది.. సెప్టెంబరు 23 నాటికి పశ్చిమ రాజస్థాన్, కచ్‌లోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. సగటు సముద్ర మట్టం వద్ద గల ఋతుపవన ద్రోణి ఇప్పుడు బికనీర్, గుణ, సాగర్, బిలాస్‌పూర్, చంద్‌బాలి మరియు ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నది.. దీంతోపాటు తూర్పు-పశ్చిమ ద్రోణి ఆంధ్రప్రదేశ్ తీరం నుండి దక్షిణ కోస్తా మాయన్మార్ వరకు రెండు పెనవేసుకొనబడిన ఎగువ ఉపరితల అవర్తనముల నుంచి ఒకటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా, మరొకటి దక్షిణ తీరప్రాంత మయన్మార్ & పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతున్నది.. తరువాత రెండవ ఎగువ ఉపరితల అవర్తనము పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది..

ఈ రెండు ఎగువ గాలి ఉపరితల అవర్తనముల ప్రభావంతో 23న సెప్టెంబర్, 2024 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం.. పరిసరాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అమరావతి వెల్లడించింది.. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో చూడండి..

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశము ఎక్కువగా ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

సోమవారం, మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశము చాలాఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్;-

ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశము ఎక్కువగా ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముచాలా ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశము ఎక్కువగా ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ :-

ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశము ఎక్కువగా ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలాచోట్ల కురిసే అవకాశము చాలా ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముఎక్కువగా ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article