జక్కన్న సినిమాలో ఒక్క క్యారెక్టర్ వస్తే చాలు అనుకునే హీరో హీరోయిన్లు చాలామందే ఉన్నారు. టాలీవుడ్ నుంచి కోలివుడ్.. బాలీవుడ్ నుంచి మాలీవుడ్.. ఇలా అన్ని ఇండస్ట్రీల నటులు క్యూ కడతారు. కానీ ఓ టాలీవుడ్ హీరో మాత్రం రాజమౌళి చిత్రానికి నో చెప్పాడు.. ఎవరో తెల్సా
Rajamouli
ఎస్.ఎస్.రాజమౌళి.. తెలుగువారికి ఈ పేరు సుపరిచితమే. ఒక్క ఇండియా మాత్రమే కాదు.. ప్రపంచమంతా ప్రస్తుతం రాజమౌళి సినిమాల కోసం ఎదురుచూస్తోంది. బాహుబలితో తెలుగు ఖ్యాతిని ప్యాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకున్నాడు. హాలివుడ్ డైరెక్టర్లు స్టీఫెన్ స్పీల్‌బర్గ్, జేమ్స్ కామెరూన్ లాంటివారు కూడా ఇప్పుడు రాజమౌళి సినిమాల గురించి గొప్పగా చెబుతున్నారంటే.. జక్కన్న క్రేజ్ అలాంటిది మరి. అందుకేనేమో రాజమౌళి సినిమాల్లో చిన్న క్యారెక్టర్ పడినా చాలు అనుకునే నటీనటులు ఎందరో ఉన్నారు. అలాంటిది ఓ స్టార్ హీరో రాజమౌళి సినిమాను కథ నచ్చలేదని రిజెక్ట్ చేశాడు. కట్ చేస్తే.. అదే కథను మరో హీరోతో తెరకెక్కించి బంపర్ హిట్ కొట్టాడు. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు..
డార్లింగ్ ప్రభాస్. ఇంతకీ ప్రభాస్ రిజెక్ట్ చేసిన రాజమౌళి చిత్రం ఏంటో తెల్సా.. అదే ‘స్టూడెంట్ నెంబర్ 1’. ప్రభాస్ వద్దన్న ఆ కథను ఎన్టీఆర్‌తో తీసి సూపర్ హిట్ కొట్టాడు జక్కన్న. ‘స్టూడెంట్ నెంబర్ 1’ కథను ముందుగా రాజమౌళి ప్రభాస్‌కు చెప్పాడట. అయితే ఆ కథ ప్రభాస్‌కు నచ్చకపోవడంతో సినిమాను రిజెక్ట్ చేశాడు. ఇప్పటికీ ఈ విషయాన్ని రాజమౌళి చాలాసార్లు పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఇలా జక్కన్న కథను రిజెక్ట్ చేసిన ఏకైక తెలుగు హీరో ప్రభాస్ అయ్యాడు. ఇక ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో 3 సినిమాలు వచ్చాయి. ‘ఛత్రపతి’, ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’. ఈ మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్స్ అయ్యాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి