గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో చరణ్ మరోసారి తన అద్భుతమైన నటనతో మెప్పించారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆర్సీ 16 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సైతం స్టార్ట్ అయ్యింది. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. తాజాగా ఈ విషయంపై చిత్రయూనిట్ స్పందించింది.
ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. కానీ ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆయన స్థానంలో దేవీ శ్రీ ప్రసాద్ తీసుకున్నట్లు ప్రచారం నడుస్తుంది. తాజాగా ఈ వార్తలపై టీమ్ స్పందించింది. ఇది ఫేక్ న్యూస్ అని తెలిపింది. ఇలాంటి రూమర్స్ ను షేర్ చేయొద్దని కోరింది. వీటిని నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ జనవరి 27 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఆర్సీ 16 సినిమా గురించి వస్తున్న వార్తలను అసలు నమ్మొద్దని కోరింది.
తాజాగా ఈ సినిమా గురించి ఏఆర్ రెహమాన్ ఐఫా అవార్డులలోనూ మాట్లాడారు. ఇందుకు సంబంధించిన మ్యూజిక్ వర్క్స్ ప్రారంభమైందన్నారు. రెండు పాటలు కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. బుచ్చిబాబు ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా.. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఇది సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో చరణ్ పాత్ర పవర్ ఫుల్ గా ఉండనుంది. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..