తాజాగా డిఫెండింగ్ ఛాంపియన్ RCB రిటెన్షన్ లీస్టు విడుదల చేసింది. మినీ వేలానికి ముందు, ఈ ఫ్రాంచైజీ జట్టు 7 మంది ఆటగాళ్లను విడుదల చేసింది. IPL లాగా WPLలో మెగా వేలం లేదు. బదులుగా మినీ వేలం ఉంటుంది. ఆ విధంగా ఫ్రాంచైజీలు గరిష్ట సంఖ్యలో ఆటగాళ్లను నిలుపుకుంటాయి. జట్టు నుండి చాలా తక్కువ మంది ఆటగాళ్లను తొలగిస్తాయి.
బీసీసీఐ నిబంధనల ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీకి 18 మంది మహిళా ఆటగాళ్లను జట్టులో ఉంచుకోవడానికి అనుమతి ఉంది. అందులో ఆరుగురు విదేశీ ఆటగాళ్లను తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఇలా కొద్ది రోజుల క్రితమే ట్రేడింగ్ ద్వారా డానీ వాట్‌ను కొనుగోలు చేసిన ఆర్సీబీ జట్టులో విదేశీ ఆటగాళ్ల సంఖ్య 8కి చేరుకుంది. అందుకే, RCB జట్టు నుండి ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్, దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ నాడిన్ డి క్లెర్క్‌లను విడుదల చేసింది.
Your talent, commitment, squad tone and kindness volition f♾️rever resonate with us. 🫶
Though our journeys whitethorn portion ways for now, our enslaved continues to stay strong. 💪
Thank you for the passion, the perseverance, and the unforgettable memories etched into our history! 🙌… pic.twitter.com/vpg14OCCSO
— Royal Challengers Bengaluru (@RCBTweets) November 7, 2024
RCB నుండి తప్పుకున్న ఆటగాళ్లు:
దిశా కసత్, ఇంద్రాణి రాయ్, నాడిన్ డి క్లర్క్, శుభా సతీష్, శ్రద్ధా పోకర్కర్, సిమ్రాన్ బహదూర్, హీథర్ నైట్
RCB అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు వీళ్లే:
- స్మృతి మంధాన
- ఎల్లిస్ పెర్రీ
- రిచా ఘోష్
- సబ్బినేని మేఘన
- రాంకా పాటిల్
- జార్జియా వేర్‌హామ్
- ఆశా శోభన
- రేణుకా సింగ్
- సోఫీ డివైన్
- సోఫీ మోలినెక్స్
- ఏక్తా బిష్త్
- కనికా అహుజా
- కేట్ క్రాస్
- డేనియల్ వ్యాట్
కోహ్లీకి పదేళ్ల క్రితం ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ ప్రపోజ్ చేసిన విషయం మనందరీకి తెలిసిందే. ఇటివలే జట్టులోకి ఆర్సీబీ ఆమెను తీసుకుంది.