ఇటీవల రివ్యూల కారణంగా నష్టపోయిన సినిమాల విషయంలో ఓ మీటింగ్ నిర్వహించిన తమిళ్ ఫిలిం యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోషియేషన్, పరిశ్రమ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించింది. కంగువాతో పాటు వేట్టయన్, ఇండియా 2 సినిమాల ఫలితం విషయంలోనూ పబ్లిక్ టాక్, యూట్యూబ్ రివ్యూ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
తమిళ సినిమా పరిశ్రమ భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా థియేటర్ల యాజమాన్యాలు, యూట్యూబ్ ఛాన్సల్స్ను సినిమా హాల్ ప్రాంగణాల్లోకి అనుమతించకూడదని సూచించింది. ముఖ్యంగా ఫస్ట్ డే ఫస్ట్ షో సమయంలో థియేటర్ల దగ్గర పబ్లిక్ టాక్ తీసుకునేందుకు, రివ్యూలు ఇచ్చేందుకు అవకాశం కల్పించకూడదని కోరింది. రివ్యూల పేరుతో నటీనటులు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణుల మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ప్రొడ్యూసర్స్ అసోషియేషన్. ఈ నిర్ణయం మీదే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రాక్టికల్‌గా ఈ నిర్ణయాల అమలు ఎంత వరకు సాధ్యపడుతుందో చూడాలి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.